Sesavettavayyaa itte selimeemdanu

సేసవెట్టవయ్యా ఇట్టె చెలిమీఁదను
Language

(॥పల్లవి॥)
సేసవెట్టవయ్యా ఇట్టె చెలిమీఁదను
ఆసల మీకిద్దరికి నన్నిటా నమరును

(॥నేస॥)
గక్కనఁ జెట్టపట్టితే కంకణము వంటి దాపె
దక్కి వురమెక్కితేను తాళివంటిది
మొక్కలానఁ దొడెక్కితే మొలనూలువంటిది
అక్కజమై నీకు నాపె కన్నిటా నమరును

(॥నేస॥)
చేరి విన్నవించితేను చెవిపోగులవంటిది
నీరతికి వద్దనుంటే నీడవంటిది
కోరి పానుపుపై పెండ్లికూఁతురువంటి దేపొద్దు
ఆరీతి నాపెకు నీకు నన్నిటా నమరును

(॥నేస॥)
పాదాలసేవసేసితే పావకోరళ్ల వంటిది
సోదించి కూచుండితేను సొమ్మువంటిది
యీదెస శ్రీవేంకటేశ యింతి నీవుఁ గూడితిరి
ఆదిగొని నీకు నాపె కన్నిటా నమరును

(||pallavi||)
sesavĕṭṭavayyā iṭṭĕ sĕlimīm̐danu
āsala mīgiddarigi nanniḍā namarunu

(||nesa||)
gakkanam̐ jĕṭṭabaṭṭide kaṁkaṇamu vaṁṭi dābĕ
dakki vuramĕkkidenu tāḽivaṁṭidi
mŏkkalānam̐ dŏḍĕkkide mŏlanūluvaṁṭidi
akkajamai nīgu nābĕ kanniḍā namarunu

(||nesa||)
seri vinnaviṁchidenu sĕvibogulavaṁṭidi
nīradigi vaddanuṁṭe nīḍavaṁṭidi
kori pānububai pĕṁḍligūm̐turuvaṁṭi debŏddu
ārīdi nābĕgu nīgu nanniḍā namarunu

(||nesa||)
pādālasevaseside pāvagoraḽla vaṁṭidi
sodiṁchi kūsuṁḍidenu sŏmmuvaṁṭidi
yīdĕsa śhrīveṁkaḍeśha yiṁti nīvum̐ gūḍidiri
ādigŏni nīgu nābĕ kanniḍā namarunu