సేసతో బెండ్లాడితివి చెల్లుబడి కాకపోదు
(॥పల్లవి॥)
సేసతో బెండ్లాడితివి చెల్లుబడి కాకపోదు
గాసిఁ బెట్ట కిట్టె నన్ను గరుణించరాదా
(॥॥)
చెన్నుమీర చిత్తము రా సేవలు నేయకుండితే
నన్ను నీవప్పుడు మరి నగరాదా
వన్నెల నిన్నిట్టె కైవసము సేసుకుంటే
మిన్నక నీ పంతములు మెరయరాదా
(॥॥)
ఆయము లంటుచు నిన్ను నాసకొలుపకుండితే
పాయపుమదాన నన్నే పలుకరాదా
చాయల నే నీమోవి చవులుగొనకుండితే
సోయగపుబిన్నాణానఁ జూడఁగరాదా
(॥॥)
చేవమీరినరతుల సిగ్గులు రేఁచకుండితే
నీవాసు లిన్నియును నెరపరాదా
శ్రీవేంకటేశ్వర యిట్టె చేకొని కూడితివి
యీ వేడుకులు గలిగె నిఁక మెచ్చరాదా
(||pallavi||)
sesado bĕṁḍlāḍidivi sĕllubaḍi kāgabodu
gāsim̐ bĕṭṭa kiṭṭĕ nannu garuṇiṁcharādā
(||||)
sĕnnumīra sittamu rā sevalu neyaguṁḍide
nannu nīvappuḍu mari nagarādā
vannĕla ninniṭṭĕ kaivasamu sesuguṁṭe
minnaga nī paṁtamulu mĕrayarādā
(||||)
āyamu laṁṭusu ninnu nāsagŏlubaguṁḍide
pāyabumadāna nanne palugarādā
sāyala ne nīmovi savulugŏnaguṁḍide
soyagabubinnāṇānam̐ jūḍam̐garādā
(||||)
sevamīrinaradula siggulu rem̐saguṁḍide
nīvāsu linniyunu nĕrabarādā
śhrīveṁkaḍeśhvara yiṭṭĕ segŏni kūḍidivi
yī veḍugulu galigĕ nim̐ka mĕchcharādā