Seruva jaanadanaalu sepparammaa

చేరువ జాణతనాలు చెప్పరమ్మా
Language

(॥పల్లవి॥)
చేరువ జాణతనాలు చెప్పరమ్మా
ఆరితేరిన పనులు అవి చెప్పరమ్మా

(॥॥)
మెలుపున రమణుఁడు మెల్లనే మాటాడితేను
చెలి యాల నవ్వు నవ్వె చెప్పరమ్మా
సొలపున నప్పటి నీ సురటి విసరుకొంటే
అలరి వెంగె మేలాడె నది చెప్పరమ్మా

(॥॥)
సారెకుఁ బువ్వుల బంతి సరసుఁడు మూకొనఁగ
చేరి సతి యాల మెచ్చెఁ జెప్పరమ్మా
నేరుపున నంతలోనె నెత్తమాడ రాఁగాను
ఆరసి మొక్కులు మొక్కె నది చెప్పరమ్మా

(॥॥)
పక్కన శ్రీ వేంకటాదిపతి గౌఁగిలించుకొంటే
చెక్కుచే యిడనే లింతి చెప్పరమ్మా
తక్కి అప్పుడే రతిఁ దలపోసుకొంటేను
అక్కరతోఁ బొగడీని అది చెప్పరమ్మా

(||pallavi||)
seruva jāṇadanālu sĕpparammā
āriderina panulu avi sĕpparammā

(||||)
mĕlubuna ramaṇum̐ḍu mĕllane māḍāḍidenu
sĕli yāla navvu navvĕ sĕpparammā
sŏlabuna nappaḍi nī suraḍi visarugŏṁṭe
alari vĕṁgĕ melāḍĕ nadi sĕpparammā

(||||)
sārĕgum̐ buvvula baṁti sarasum̐ḍu mūgŏnam̐ga
seri sadi yāla mĕchchĕm̐ jĕpparammā
nerubuna naṁtalonĕ nĕttamāḍa rām̐gānu
ārasi mŏkkulu mŏkkĕ nadi sĕpparammā

(||||)
pakkana śhrī veṁkaḍādibadi gaum̐giliṁchugŏṁṭe
sĕkkuse yiḍane liṁti sĕpparammā
takki appuḍe radim̐ dalabosugŏṁṭenu
akkaradom̐ bŏgaḍīni adi sĕpparammā