చేరి యిందుకుఁగా నే నీచెక్కు నొక్కేను
(॥పల్లవి॥)
చేరి యిందుకుఁగా నే నీచెక్కు నొక్కేను
నేరనివారని కన్నీ నేరుపుటే పుణ్యము
(॥చేరి॥)
నీవంకఁ గడమలేదు నేనే దూరుదుఁగాని
మూవంకల నిందుకు నే మొక్కేనయ్యా
తావున మోహించినట్టి తమకాన నాఁడువారు
సేవలు సేయఁబోఁగానే చేయి కాలు దాఁకును
(॥చేరి॥)
తప్పవు నీ వేమిటాను తతిమీరుదు నేనై తే
యిప్పు డన్నిటికిఁ బంతమిచ్చేనయ్యా
వొప్పుగా నేకతవేళ వుండేవూడిగపువారు
ముప్పిరిఁ బాదా లొత్తఁగ మునిగోరు దాఁకును
(॥చేరి॥)
అట్టె శ్రీవేంకటపతి వలమేల్‌మంగను నేను
చుట్టిరికము నేతువు సొలతు నేను
పట్టదేవైన నేను పానుపుపై నుండఁగాను
మట్టుమీరి పెనఁగఁగ మర్మములు దాఁకును
(||pallavi||)
seri yiṁdugum̐gā ne nīsĕkku nŏkkenu
neranivārani kannī nerubuḍe puṇyamu
(||seri||)
nīvaṁkam̐ gaḍamaledu nene dūrudum̐gāni
mūvaṁkala niṁdugu ne mŏkkenayyā
tāvuna mohiṁchinaṭṭi tamagāna nām̐ḍuvāru
sevalu seyam̐bom̐gāne seyi kālu dām̐kunu
(||seri||)
tappavu nī vemiḍānu tadimīrudu nenai te
yippu ḍanniḍigim̐ baṁtamichchenayyā
vŏppugā negadaveḽa vuṁḍevūḍigabuvāru
muppirim̐ bādā lŏttam̐ga munigoru dām̐kunu
(||seri||)
aṭṭĕ śhrīveṁkaḍabadi valamelmaṁganu nenu
suṭṭirigamu neduvu sŏladu nenu
paṭṭadevaina nenu pānububai nuṁḍam̐gānu
maṭṭumīri pĕnam̐gam̐ga marmamulu dām̐kunu