Seri vooragumte taane sigguvadunu

చేరి వూరకుంటే తానే సిగ్గువడును
Language

(॥పల్లవి॥)
చేరి వూరకుంటే తానే సిగ్గువడును
నేర మెంచకుమనరే నే నంటఁగాకుందాన

(॥॥)
పచ్చడ మందుకోరే పాదాలు గడుగరే
రచ్చసేసి వచ్చినాఁడు రమణుఁడు
గచ్చుల దూరకురే గక్కనఁ బీఁటవెట్టరే
నెచ్చెలుల కై దండతో నిలిచియున్నాఁడు

(॥॥)
వీడెము చేతికియ్యరే విసరరే సురటిని
ఆడానీడాఁ దిరిగాడి అలసినాఁడు
వాడెననకురే మోవి వడిఁబానుపు వేయరే
వేడుకఁ బండేఇల్లు వెదకుచున్నాఁడు

(॥॥)
పువ్వులు ముడువరే పూయరే మేనఁ గస్తూరి
వువ్విళ్లూరఁ జెమటతో నున్నవాఁడు
యివ్వల శ్రీ వేంకటేశుఁ డిట్టె నన్నుఁ గాఁగిలించె
చివ్వన నాలునాళ్లు సేసిన దెఱిఁగినాఁడు

(||pallavi||)
seri vūraguṁṭe tāne sigguvaḍunu
nera mĕṁchagumanare ne naṁṭam̐gāguṁdāna

(||||)
pachchaḍa maṁdugore pādālu gaḍugare
rachchasesi vachchinām̐ḍu ramaṇum̐ḍu
gachchula dūragure gakkanam̐ bīm̐ṭavĕṭṭare
nĕchchĕlula kai daṁḍado nilisiyunnām̐ḍu

(||||)
vīḍĕmu sedigiyyare visarare suraḍini
āḍānīḍām̐ dirigāḍi alasinām̐ḍu
vāḍĕnanagure movi vaḍim̐bānubu veyare
veḍugam̐ baṁḍeillu vĕdagusunnām̐ḍu

(||||)
puvvulu muḍuvare pūyare menam̐ gastūri
vuvviḽlūram̐ jĕmaḍado nunnavām̐ḍu
yivvala śhrī veṁkaḍeśhum̐ ḍiṭṭĕ nannum̐ gām̐giliṁchĕ
sivvana nālunāḽlu sesina dĕṟim̐ginām̐ḍu