చేరి వూరకేల రట్టు సేసేవు నన్ను
(॥పల్లవి॥)
చేరి వూరకేల రట్టు సేసేవు నన్ను
సారె నాతో నవ్వేవు నీసరిదాననా
(॥॥)
వెలయ నాచెక్కునొక్కి వేఁడుకొనే విందరిలో
అలుగ నీతో నే నంతదాననా
మలసి యప్పటి నన్ను మాఁటలాడించవచ్చేవు
పలుకకుండఁగ నీతోఁ బంతగతైనా
(॥॥)
జట్టిగొని చేయివట్టి సంగడికిఁ దీసేవు
అట్టె పెనఁగ నీతో వియ్యపుదాననా
గుట్టున నాపట్టుచీరకొంగు వట్టుకున్నాఁడవు
తొట్టిన గర్వమున నీతో బలిమిదాననా
(॥॥)
జక్కవచన్నులంటి సమరతి లాలించేవు
పక్కన నీతో మొచ్చపాటిదాననా
యిక్కడ శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నిట్టె
నెక్కొని నీవలె నంన్నీ నేరిచినదాననా
(||pallavi||)
seri vūragela raṭṭu sesevu nannu
sārĕ nādo navvevu nīsaridānanā
(||||)
vĕlaya nāsĕkkunŏkki vem̐ḍugŏne viṁdarilo
aluga nīdo ne naṁtadānanā
malasi yappaḍi nannu mām̐ṭalāḍiṁchavachchevu
palugaguṁḍam̐ga nīdom̐ baṁtagadainā
(||||)
jaṭṭigŏni seyivaṭṭi saṁgaḍigim̐ dīsevu
aṭṭĕ pĕnam̐ga nīdo viyyabudānanā
guṭṭuna nābaṭṭusīragŏṁgu vaṭṭugunnām̐ḍavu
tŏṭṭina garvamuna nīdo balimidānanā
(||||)
jakkavasannulaṁṭi samaradi lāliṁchevu
pakkana nīdo mŏchchabāḍidānanā
yikkaḍa śhrī veṁkaḍeśha yelidivi nannu niṭṭĕ
nĕkkŏni nīvalĕ naṁnnī nerisinadānanā