Seri taam jeppinattellaa jesem gaani

చేరి తాఁ జెప్పినట్టెల్లా జేసేఁ గాని
Language

(॥పల్లవి॥)
చేరి తాఁ జెప్పినట్టెల్లా జేసేఁ గాని
పేరు కుచ్చి మా యింటికిఁ బిలువకే యాతని

(॥చేరి॥)
యెవ్వరింటఁ జూచినాను యేరూపై వున్నాఁడో
యివ్వలఁ గమలాసతియింట నున్నాఁడో
మవ్వపు పాలజలధి మామయింట నున్నవాఁడొ
రవ్వగా వెదకి తేరే రమ్మని మా యింటికి

(॥చేరి॥)
గక్కన ప్రహ్లదుకుఁగా కంబములో నున్నవాఁడో
పుక్కట కావులఁ గావఁ బోయి వున్నాఁడో
చిక్కించుక గోపికలచీర లంట బోయినాఁడో
దిక్కుల వెదకి తోడి తేరే మా యింటికి

(॥చేరి॥)
అల్లదే రేపల్లెలోన నాడఁబోయి వున్నాఁడో
యిల్లిదె సీతఁ బెండ్లాడ నేగినాఁడో
వొల్లనే శ్రీవేంకటాద్రినుండేటి దైవము నేఁడు
వుల్లసాన విచ్చేసెనే వున్నతి మా యింటికి

(||pallavi||)
seri tām̐ jĕppinaṭṭĕllā jesem̐ gāni
peru kuchchi mā yiṁṭigim̐ biluvage yādani

(||seri||)
yĕvvariṁṭam̐ jūsinānu yerūbai vunnām̐ḍo
yivvalam̐ gamalāsadiyiṁṭa nunnām̐ḍo
mavvabu pālajaladhi māmayiṁṭa nunnavām̐ḍŏ
ravvagā vĕdagi tere rammani mā yiṁṭigi

(||seri||)
gakkana prahladugum̐gā kaṁbamulo nunnavām̐ḍo
pukkaḍa kāvulam̐ gāvam̐ boyi vunnām̐ḍo
sikkiṁchuga gobigalasīra laṁṭa boyinām̐ḍo
dikkula vĕdagi toḍi tere mā yiṁṭigi

(||seri||)
allade reballĕlona nāḍam̐boyi vunnām̐ḍo
yillidĕ sīdam̐ bĕṁḍlāḍa neginām̐ḍo
vŏllane śhrīveṁkaḍādrinuṁḍeḍi daivamu nem̐ḍu
vullasāna vichchesĕne vunnadi mā yiṁṭigi