Seri sooda maagunaide siggulu gaanee

చేరి చూడ మాకునైతే సిగ్గులు గానీ
Language

(॥పల్లవి॥)
చేరి చూడ మాకునైతే సిగ్గులు గానీ
యీ రీతి సింగారాలు యీతనికే తగునే

(॥చేరి॥)
నున్న నిలత్తుకవన్నె నొసలిపై నించెఁగదే
అన్నువ కిన్నెరమీఁటు లాతనిమై నంటేనే
పున్నమ వెలుఁగు మోముపొంతనెల్లా నిండెఁగదే
యిన్నేసి సింగారాలు యీతనికే తగునే

(॥చేరి॥)
కుంకుమగుబ్బల పూఁతగుఱుతు మైనంటెఁగదే
అంకెల మోవి కెంపులు అమరెఁగదే
కొంకక వాడుఁ బువ్వులు కొప్పుమీఁద రాలెఁగదే
యింకా నిన్ని సింగారాలు యీతనికే తగునే

(॥చేరి॥)
శిరసుచెమటవాన చిత్తడి పై జారెఁగదే
యెరవుల సొమ్ము మేన నిదివో కదే
పరగ శ్రీ వేంకటాద్రిపతి నన్నుఁ గూడెఁగదె
యిరవైన సింగారాలు యీతనికే తగునే

(||pallavi||)
seri sūḍa māgunaide siggulu gānī
yī rīdi siṁgārālu yīdanige tagune

(||seri||)
nunna nilattugavannĕ nŏsalibai niṁchĕm̐gade
annuva kinnĕramīm̐ṭu lādanimai naṁṭene
punnama vĕlum̐gu momubŏṁtanĕllā niṁḍĕm̐gade
yinnesi siṁgārālu yīdanige tagune

(||seri||)
kuṁkumagubbala pūm̐taguṟudu mainaṁṭĕm̐gade
aṁkĕla movi kĕṁpulu amarĕm̐gade
kŏṁkaga vāḍum̐ buvvulu kŏppumīm̐da rālĕm̐gade
yiṁkā ninni siṁgārālu yīdanige tagune

(||seri||)
śhirasusĕmaḍavāna sittaḍi pai jārĕm̐gade
yĕravula sŏmmu mena nidivo kade
paraga śhrī veṁkaḍādribadi nannum̐ gūḍĕm̐gadĕ
yiravaina siṁgārālu yīdanige tagune