Seri penamgamgambode sitta mettumduno

చేరి పెనఁగఁగఁబోతే చిత్త మెట్టుండునో
Language

(॥పల్లవి॥)
చేరి పెనఁగఁగఁబోతే చిత్త మెట్టుండునో
కోరి తను నింతేసి కొరఁగ నేలే

(॥॥)
తగిలి నా తమకమే తనకు దయ వుట్టించీ
వెగటుగా విన్నవించ నేలే
మొగము చూచినా యాసె మోహము దనకు రేఁచీ
అగడుసేసి కొసరి యలయించ నేలే

(॥॥)
కిందుపడి తనకు మొక్కే మొక్కె పలమిచ్చీ
చందముగాఁ దన్నిట్టే వేసరించ నేలే
కందువ నే నంపే కానుకలే తను రప్పించి
సందడించి సారె సారె చండిపెట్ట నేలే

(॥॥)
కడు నేఁ జేసే వూడిగాలే తన కెచ్చరించి
బడి బడి దైన్యము చూప నిఁ క నేలే
చిడిముడిఁ దానె వచ్చి శ్రీ వేంకటేశుఁడు గూడె
గుడిగొన సంతోషిచుకొంటెఁ జెప్ప నేలే

(||pallavi||)
seri pĕnam̐gam̐gam̐bode sitta mĕṭṭuṁḍuno
kori tanu niṁtesi kŏram̐ga nele

(||||)
tagili nā tamagame tanagu daya vuṭṭiṁchī
vĕgaḍugā vinnaviṁcha nele
mŏgamu sūsinā yāsĕ mohamu danagu rem̐sī
agaḍusesi kŏsari yalayiṁcha nele

(||||)
kiṁdubaḍi tanagu mŏkke mŏkkĕ palamichchī
saṁdamugām̐ danniṭṭe vesariṁcha nele
kaṁduva ne naṁpe kānugale tanu rappiṁchi
saṁdaḍiṁchi sārĕ sārĕ saṁḍibĕṭṭa nele

(||||)
kaḍu nem̐ jese vūḍigāle tana kĕchchariṁchi
baḍi baḍi dainyamu sūba nim̐ ka nele
siḍimuḍim̐ dānĕ vachchi śhrī veṁkaḍeśhum̐ḍu gūḍĕ
guḍigŏna saṁtoṣhisugŏṁṭĕm̐ jĕppa nele