Seri pemdlaadaraadaa sesalu vetti

చేరి పెండ్లాడరాదా సేసలు వెట్టి
Language

(॥పల్లవి॥)
చేరి పెండ్లాడరాదా సేసలు వెట్టి
సారెకు నీ మోవి చూపి సన్నలేమి సేసేవే

(॥చేరి॥)
పిప్పిగట్ట నాతనితో పెనఁగులాడి యందాఁకా
వుప్పతిలుఁ జెమటల నోలలాడేవే
తప్పక చూచి యప్పటి తమి యెంత పెంచేవే
కుప్పగాఁ గోరిక లెంత కూడపోసేవే

(॥చేరి॥)
గుట్టుతోడ నిలుచుండి కొలువుసేసి యందాఁకా
చిట్టంటుఁ బులకలను చిమ్మిరేఁగేవే
బట్టబయలు వలచి భావమెంత గరఁగేవే
దట్టపు సిగ్గుల నెంత దడి గట్టేవే

(॥చేరి॥)
పానుపుపైఁ గూచుండి బాఁతిపడి యందాఁకా
నానఁబెట్టి నానఁబెట్టి నవ్వు నవ్వేవే
ఆనుక శ్రీవేంకటేశుఁ డంతలోనే నిన్నుఁగూడె
పూని సంతోసాలెంత పోగువెట్టేవే

(||pallavi||)
seri pĕṁḍlāḍarādā sesalu vĕṭṭi
sārĕgu nī movi sūbi sannalemi seseve

(||seri||)
pippigaṭṭa nādanido pĕnam̐gulāḍi yaṁdām̐kā
vuppadilum̐ jĕmaḍala nolalāḍeve
tappaga sūsi yappaḍi tami yĕṁta pĕṁcheve
kuppagām̐ goriga lĕṁta kūḍaboseve

(||seri||)
guṭṭudoḍa nilusuṁḍi kŏluvusesi yaṁdām̐kā
siṭṭaṁṭum̐ bulagalanu simmirem̐geve
baṭṭabayalu valasi bhāvamĕṁta garam̐geve
daṭṭabu siggula nĕṁta daḍi gaṭṭeve

(||seri||)
pānububaim̐ gūsuṁḍi bām̐tibaḍi yaṁdām̐kā
nānam̐bĕṭṭi nānam̐bĕṭṭi navvu navveve
ānuga śhrīveṁkaḍeśhum̐ ḍaṁtalone ninnum̐gūḍĕ
pūni saṁtosālĕṁta poguvĕṭṭeve