Seri neevu seppinattu seyanevalem gaani

చేరి నీవు చెప్పినట్టు సేయనేవలెఁ గాని
Language

(॥పల్లవి॥)
చేరి నీవు చెప్పినట్టు సేయనేవలెఁ గాని
మేర మీఱరాదుగా మిక్కిలి నీతోను

(॥॥)
వెడ్డు వెట్టి చెక్కు నొక్కి వేఁడుకోఁగా నీతోను
వొడ్డించుకోరాదుగా వువిదకును
జిడ్డుదేరఁ గత లెల్లాఁ జెప్పి వొడఁబఱచఁగ
అడ్డ మాడరాదుగా ఆపెకు నీతోను

(॥॥)
కప్పుర మిచ్చి నీవు కౌఁగిలించుకొనఁగాను
తప్పుంచుకోరాదుగా తరుణికిని
దప్పిదేర మోవి యాని తమ్ములము నీ విడఁగా
వుప్పతించరాదుగా వూరకే నీతోను

(॥॥)
తిద్దుచు రతులఁ గూడి తెప్పలఁ చేలుచఁ గాను
గద్దించరాదుగా కాంతకును
అద్దుక శ్రీ వేంకటేశ ఆదరించి యేలితివి
కొద్ది మీఱఁ దగదుగా కొసరి నీతోను

(||pallavi||)
seri nīvu sĕppinaṭṭu seyanevalĕm̐ gāni
mera mīṟarādugā mikkili nīdonu

(||||)
vĕḍḍu vĕṭṭi sĕkku nŏkki vem̐ḍugom̐gā nīdonu
vŏḍḍiṁchugorādugā vuvidagunu
jiḍḍuderam̐ gada lĕllām̐ jĕppi vŏḍam̐baṟasam̐ga
aḍḍa māḍarādugā ābĕgu nīdonu

(||||)
kappura michchi nīvu kaum̐giliṁchugŏnam̐gānu
tappuṁchugorādugā taruṇigini
dappidera movi yāni tammulamu nī viḍam̐gā
vuppadiṁcharādugā vūrage nīdonu

(||||)
tiddusu radulam̐ gūḍi tĕppalam̐ selusam̐ gānu
gaddiṁcharādugā kāṁtagunu
adduga śhrī veṁkaḍeśha ādariṁchi yelidivi
kŏddi mīṟam̐ dagadugā kŏsari nīdonu