చేరి నీవేడుకలెల్లాఁ జెల్లీఁ గాని
(॥పల్లవి॥)
చేరి నీవేడుకలెల్లాఁ జెల్లీఁ గాని
తారుకాణలయ్యీ యేకతానకు రారాదా
(॥చేరి॥)
అచ్చలాన నీవు నన్ను నడిగేవు మాటలెల్లా
రచ్చలోనఁ జెప్పుదురా రామలద్ది
కచ్చువెట్టి వె మంతగల వాఁడ వై తేను
తచ్చి నీవు వేచి యేకతానకు రారాదా
(॥చేరి॥)
పిలిచి సన్న చేసేవు ప్రియరాలిరాకకు
కొలువులోకి దెత్తురా కోమలిని
కలయఁగ నీ కిప్పుడు కడు వేడు కై తేను
తలకొని యిట్టె యేకతానకు రారాదా
(॥చేరి॥)
చెక్కు నొక్కి వేఁడుకొని చెలియఁ జూప మనేవు
పక్క దెచ్చి పెట్టుదురా పడఁతులను
యిక్కడ శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు
దక్కితివి యిట్టె యాక తానకు రారాదా
(||pallavi||)
seri nīveḍugalĕllām̐ jĕllīm̐ gāni
tārugāṇalayyī yegadānagu rārādā
(||seri||)
achchalāna nīvu nannu naḍigevu māḍalĕllā
rachchalonam̐ jĕppudurā rāmaladdi
kachchuvĕṭṭi vĕ maṁtagala vām̐ḍa vai tenu
tachchi nīvu vesi yegadānagu rārādā
(||seri||)
pilisi sanna sesevu priyarālirāgagu
kŏluvulogi dĕtturā komalini
kalayam̐ga nī kippuḍu kaḍu veḍu kai tenu
talagŏni yiṭṭĕ yegadānagu rārādā
(||seri||)
sĕkku nŏkki vem̐ḍugŏni sĕliyam̐ jūba manevu
pakka dĕchchi pĕṭṭudurā paḍam̐tulanu
yikkaḍa śhrīveṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
dakkidivi yiṭṭĕ yāga tānagu rārādā