Seri neemogamu soosi siggayyee naagu

చేరి నీమొగము చూచి సిగ్గయ్యీ నాకు
Language

(॥పల్లవి॥)
చేరి నీమొగము చూచి సిగ్గయ్యీ నాకు
తారుకాణలాయ అన్నీఁ దలఁచుకోరా

(॥॥)
నెలఁతను లాలించేవు నెరులచిక్కు దీసేవు
వలపులు రేఁచేవు వద్దఁ గూచుండి
పిలిచినాఁ బలుకవు పిక్కటిల్లుఁ బరాకుతో
చెలులెల్లా నవ్వేరు చిత్తగించరాదా

(॥॥)
పూవులదండ వేసేవు పొంచి వొడివట్టేవు
వావులు చెప్పిచూపేవు వద్దఁ గూచుండి
చేవట్టితీసినా రావు చెంతనే నివ్వెరగంది
దేవుళ్లే నిన్ను నవ్వేరు తెలుసుకోరాదా

(॥॥)
కన్నులనే సొలసేవు కాఁగిలించి కూడేవు
వన్నెలమోవి యిచ్చేవు వద్దఁ గూచుండి
యిన్నిటా శ్రీవేంకటేశ యేలితి వాకెను నన్ను
కన్నెలె నిన్ను నవ్వేరు కనుకొఁనరాదా

(||pallavi||)
seri nīmŏgamu sūsi siggayyī nāgu
tārugāṇalāya annīm̐ dalam̐sugorā

(||||)
nĕlam̐tanu lāliṁchevu nĕrulasikku dīsevu
valabulu rem̐sevu vaddam̐ gūsuṁḍi
pilisinām̐ balugavu pikkaḍillum̐ barāgudo
sĕlulĕllā navveru sittagiṁcharādā

(||||)
pūvuladaṁḍa vesevu pŏṁchi vŏḍivaṭṭevu
vāvulu sĕppisūbevu vaddam̐ gūsuṁḍi
sevaṭṭidīsinā rāvu sĕṁtane nivvĕragaṁdi
devuḽle ninnu navveru tĕlusugorādā

(||||)
kannulane sŏlasevu kām̐giliṁchi kūḍevu
vannĕlamovi yichchevu vaddam̐ gūsuṁḍi
yinniḍā śhrīveṁkaḍeśha yelidi vāgĕnu nannu
kannĕlĕ ninnu navveru kanugŏm̐narādā