Seri neegum daga buddi seppum gaaga

చేరి నీకుఁ దగ బుద్ది చెప్పుఁ గాక
Language

(॥పల్లవి॥)
చేరి నీకుఁ దగ బుద్ది చెప్పుఁ గాక
వేరొకతె నీచేత వేఁగఁ బోయీనా

(॥చేరి॥)
అచ్చట నీ వెవ్వతెనో అంటుకొన్నది చాలక
యిచ్చగించి నాతోఁ జెప్ప విది యొకటె
నిచ్చ నేఁ గాఁగానె కాక నీచేత మరొకతె
వచ్చి వెచ్చి రోఁతలఁ బడఁ బోయీనా

(॥చేరి॥)
కానకుండ వింతసతి గైకొన్నదిఁ గాక నన్ను
దానిపేర బిలిచేవు తగురా నీవు
కానీరా నాకంటె వేరె గయ్యాళి దొక తైతె
వూనిక నీ సుద్దులకు వోరుచు కుండీనా

(॥చేరి॥)
వీదిఁ బోయేదానితోడ వెస నవ్వుతాఁ గాక
యీదెసకుఁ బిలిచేవు యింత వలెనా
వేద దీర నిను శ్రీవెంకటేశ కూడితిని
ఆదరించి వింతది నీ వాడిన ట్లాడీనా

(||pallavi||)
seri nīgum̐ daga buddi sĕppum̐ gāga
verŏgadĕ nīseda vem̐gam̐ boyīnā

(||seri||)
achchaḍa nī vĕvvadĕno aṁṭugŏnnadi sālaga
yichchagiṁchi nādom̐ jĕppa vidi yŏgaḍĕ
nichcha nem̐ gām̐gānĕ kāga nīseda marŏgadĕ
vachchi vĕchchi rom̐talam̐ baḍam̐ boyīnā

(||seri||)
kānaguṁḍa viṁtasadi gaigŏnnadim̐ gāga nannu
dānibera bilisevu tagurā nīvu
kānīrā nāgaṁṭĕ verĕ gayyāḽi dŏga taidĕ
vūniga nī suddulagu vorusu kuṁḍīnā

(||seri||)
vīdim̐ boyedānidoḍa vĕsa navvudām̐ gāga
yīdĕsagum̐ bilisevu yiṁta valĕnā
veda dīra ninu śhrīvĕṁkaḍeśha kūḍidini
ādariṁchi viṁtadi nī vāḍina ṭlāḍīnā