చేరి నీకుఁ బలుమారుఁ జెప్పేదేమి
(॥పల్లవి॥)
చేరి నీకుఁ బలుమారుఁ జెప్పేదేమి
వూరకే నిన్నుఁ జూచుక వుండేదే మాకిఁకను
(॥చేరి॥)
రవ్వలుగనల్లనాఁడు రాజసాననుండి నాతో
నవ్వినట్టే సేసితిగా నామాట
నివ్వటిల్ల నీగుణము నేనెరిఁగి తెలిసేనా
దవ్వులనుండి మొక్కేదే తగవు మాకిఁకను
(॥చేరి॥)
పల్లదాన నీవు నాపైఁ బంతములు నెరపుచు
చెల్లినట్టె సేసితిగా చేకొని నన్ను
యెల్లవారుఁ జూడఁగాను యిఁక నిన్న నేదేమి
చల్లఁగానిచ్చలాడుటే సరవి మాకిఁకను
(॥చేరి॥)
గక్కన నీవు విచ్చేసి కాఁగిట బిగించినదే
దక్కెఁగా నాతో నీవు తమకానను
ఇక్కువ శ్రీవేంకటేశ యేఁటి విన్నపములిఁక
వెక్కసపు సంతసాన విఱ్ఱవీఁగుటిఁకను
(||pallavi||)
seri nīgum̐ balumārum̐ jĕppedemi
vūrage ninnum̐ jūsuga vuṁḍede māgim̐kanu
(||seri||)
ravvaluganallanām̐ḍu rājasānanuṁḍi nādo
navvinaṭṭe sesidigā nāmāḍa
nivvaḍilla nīguṇamu nenĕrim̐gi tĕlisenā
davvulanuṁḍi mŏkkede tagavu māgim̐kanu
(||seri||)
palladāna nīvu nābaim̐ baṁtamulu nĕrabusu
sĕllinaṭṭĕ sesidigā segŏni nannu
yĕllavārum̐ jūḍam̐gānu yim̐ka ninna nedemi
sallam̐gānichchalāḍuḍe saravi māgim̐kanu
(||seri||)
gakkana nīvu vichchesi kām̐giḍa bigiṁchinade
dakkĕm̐gā nādo nīvu tamagānanu
ikkuva śhrīveṁkaḍeśha yem̐ṭi vinnabamulim̐ka
vĕkkasabu saṁtasāna viṭravīm̐guḍim̐kanu