Seri neegu nemellaa seva sesemu

చేరి నీకు నేమెల్లా సేవ సేసేము
Language

(॥పల్లవి॥)
చేరి నీకు నేమెల్లా సేవ సేసేము
చేరఁడేసి కన్నులతో సిగ్గువడ కిఁకను

(॥చేరి॥)
చెందమ్మి రేకుల వేసె సేవంతిపూవులవేసె
కందువలు చెప్పెనాపె కలవెల్లాను
నిందమోఁచి నీవురాని నీకడమ ఇంతేకాని
పొందుల వెలితి లేదు పోరాదా లోనికి

(॥చేరి॥)
పన్నీరు నీపైఁ జల్లె బాగాలునుఁ బెట్టి పంపె
విన్నపాలన్నియుఁ జేసె వెల్లవిరిగా
సన్నలు దెలుసుకోని జాణతనము నీదింతే
పన్ని వున్నది వలపు పదవయ్య లోనికి

(॥చేరి॥)
తెర నీ నడుమ మోఁపె తెలిపి లోలోఁగూడె
శిరసీడ గురిచూపె సేసెఁ గతలు
తిరిగి నన్నుఁ గూడితి దిక్కయి శ్రీ వేంకటేశ
మరిగితివి రావయ్య మాఇంటిలోనికి

(||pallavi||)
seri nīgu nemĕllā seva sesemu
seram̐ḍesi kannulado sigguvaḍa kim̐kanu

(||seri||)
sĕṁdammi regula vesĕ sevaṁtibūvulavesĕ
kaṁduvalu sĕppĕnābĕ kalavĕllānu
niṁdamom̐si nīvurāni nīgaḍama iṁtegāni
pŏṁdula vĕlidi ledu porādā lonigi

(||seri||)
pannīru nībaim̐ jallĕ bāgālunum̐ bĕṭṭi paṁpĕ
vinnabālanniyum̐ jesĕ vĕllavirigā
sannalu dĕlusugoni jāṇadanamu nīdiṁte
panni vunnadi valabu padavayya lonigi

(||seri||)
tĕra nī naḍuma mom̐pĕ tĕlibi lolom̐gūḍĕ
śhirasīḍa gurisūbĕ sesĕm̐ gadalu
tirigi nannum̐ gūḍidi dikkayi śhrī veṁkaḍeśha
marigidivi rāvayya māiṁṭilonigi