Seri needo samgaadaalu seyamanevu nannu

చేరి నీతో సంగాతాలు సేయమనేవు నన్ను
Language

(॥పల్లవి॥)
చేరి నీతో సంగాతాలు సేయమనేవు నన్ను
గారవించి నీవే నన్నుఁ గరుణింతువు గాక

(॥చేరి॥)
వులివట్టుకొని యాపె నొడఁబరచఁగ నీతో
నెడచొచ్చి మాఁటలాడ నెట్టు వచ్చును
అడరి మంచముమీఁద నట్టె మీరు గూచుండఁగా
నడుమ నప్పటి నీతో నవ్వ నెట్టు వచ్చును

(॥చేరి॥)
యేకతానఁ దెరలోన నిద్దరూను నుండఁగాను
యీకడ నిన్నుఁ బిలువనెట్టు వచ్చును
మేకొని మీలో మీరు మించి విడేలు సేయఁగా
నాకు మడిచియ్య నీకు నది యెట్టు వచ్చును

(॥చేరి॥)
ముచ్చట నొకరొకరు మొగములు చూచుకోఁగా
యెచ్చరించి సన్నసేయ నెట్టు వచ్చును
ఇచ్చట శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నీడ
మెచ్చితి నెంతైనా నిన్ను మీర నెట్టు వచ్చును

(||pallavi||)
seri nīdo saṁgādālu seyamanevu nannu
gāraviṁchi nīve nannum̐ garuṇiṁtuvu gāga

(||seri||)
vulivaṭṭugŏni yābĕ nŏḍam̐barasam̐ga nīdo
nĕḍasŏchchi mām̐ṭalāḍa nĕṭṭu vachchunu
aḍari maṁchamumīm̐da naṭṭĕ mīru gūsuṁḍam̐gā
naḍuma nappaḍi nīdo navva nĕṭṭu vachchunu

(||seri||)
yegadānam̐ dĕralona niddarūnu nuṁḍam̐gānu
yīgaḍa ninnum̐ biluvanĕṭṭu vachchunu
megŏni mīlo mīru miṁchi viḍelu seyam̐gā
nāgu maḍisiyya nīgu nadi yĕṭṭu vachchunu

(||seri||)
muchchaḍa nŏgarŏgaru mŏgamulu sūsugom̐gā
yĕchchariṁchi sannaseya nĕṭṭu vachchunu
ichchaḍa śhrī veṁkaḍeśha yelidivi nannu nīḍa
mĕchchidi nĕṁtainā ninnu mīra nĕṭṭu vachchunu