Seri nannumjoosi yela sigguvadevu

చేరి నన్నుఁజూచి యేల సిగ్గువడేవు
Language

(॥పల్లవి॥)
చేరి నన్నుఁజూచి యేల సిగ్గువడేవు
మారుకొని యాపెతో మాఁటాడవలదా

(॥చేరి॥)
కొసరి కొసరి నిన్నుఁ గొంగువట్టితీసి నాపె
పొసఁగి చేతికిలోనై పొందవయ్య
ముసిముసినవ్వుతో నీముందరఁ జెమట గార
అసురుసురయ్యీనేలో అడుగరాదా

(॥చేరి॥)
ముద్దు ముద్దువలె నాపె మోముఁ దప్పక చూచీ
కద్దో యేమైనా మీలోఁ గనుసన్నలు
దిద్ది కస్తూరినామముఁ దీర్చీ నీనొసలను
అద్దుక మెచ్చఁగవద్దా ఆపెసేసేబత్తికి

(॥చేరి॥)
తనివారాఁ దనివారా తా నిన్నుఁ గాఁగిటఁ గూడీ
ఘనుఁడవు నీయప్పణగాఁ బోలును
యెనసితివి శ్రీవేంకటేశ యలమేల్ మంగను
నను నిదె ఆకె యున్నది సంతోసించెను

(||pallavi||)
seri nannum̐jūsi yela sigguvaḍevu
mārugŏni yābĕdo mām̐ṭāḍavaladā

(||seri||)
kŏsari kŏsari ninnum̐ gŏṁguvaṭṭidīsi nābĕ
pŏsam̐gi sedigilonai pŏṁdavayya
musimusinavvudo nīmuṁdaram̐ jĕmaḍa gāra
asurusurayyīnelo aḍugarādā

(||seri||)
muddu mudduvalĕ nābĕ momum̐ dappaga sūsī
kaddo yemainā mīlom̐ ganusannalu
diddi kastūrināmamum̐ dīrsī nīnŏsalanu
adduga mĕchcham̐gavaddā ābĕsesebattigi

(||seri||)
tanivārām̐ danivārā tā ninnum̐ gām̐giḍam̐ gūḍī
ghanum̐ḍavu nīyappaṇagām̐ bolunu
yĕnasidivi śhrīveṁkaḍeśha yalamel maṁganu
nanu nidĕ āgĕ yunnadi saṁtosiṁchĕnu