చేరి నన్నుఁ జూచి యేల సిగ్గువడేవు
(॥పల్లవి॥)
చేరి నన్నుఁ జూచి యేల సిగ్గువడేవు
నేరుపు నీకెంత గద్దో నే నెరిఁగేఁగాని
(॥చేరి॥)
ఆస నీకుఁ గలిగితే నాతనిపాదా లొత్తవే
మూసిదాంచనేల నీమోహ మీడను
సేసవెట్టవలసితే చేతులు చాఁచవే
వేసాలేల వద్దనే వీఁడే వున్నాండు
(॥చేరి॥)
మనసు నీకు వచ్చితే మాటలెల్లా నాడవే
యెనలేక గుబ్బితిలినేలే లోలోను
పని నీకుఁ గలిగితే పానుపుపైఁ బండుండవే
అనుమానించఁగనేల ఆడనే వున్నాఁడు
(॥చేరి॥)
వేడుకైతే చేతనున్నవిడె మిప్పించుకోవే
వాఁడుమోముతోడ నవ్వఁగవలెనా
కూడె శ్రీవేంకటేశుఁడు కోరి యలమేల్ మంగను
వాడిక మెచ్చవే నాకువలచివున్నాఁడు
(||pallavi||)
seri nannum̐ jūsi yela sigguvaḍevu
nerubu nīgĕṁta gaddo ne nĕrim̐gem̐gāni
(||seri||)
āsa nīgum̐ galigide nādanibādā lŏttave
mūsidāṁchanela nīmoha mīḍanu
sesavĕṭṭavalaside sedulu sām̐save
vesālela vaddane vīm̐ḍe vunnāṁḍu
(||seri||)
manasu nīgu vachchide māḍalĕllā nāḍave
yĕnalega gubbidilinele lolonu
pani nīgum̐ galigide pānububaim̐ baṁḍuṁḍave
anumāniṁcham̐ganela āḍane vunnām̐ḍu
(||seri||)
veḍugaide sedanunnaviḍĕ mippiṁchugove
vām̐ḍumomudoḍa navvam̐gavalĕnā
kūḍĕ śhrīveṁkaḍeśhum̐ḍu kori yalamel maṁganu
vāḍiga mĕchchave nāguvalasivunnām̐ḍu