Seri nannela nobide senagavoyi

చేరి నన్నేల నోపితే చెనకవోయి
Language

(॥పల్లవి॥)
చేరి నన్నేల నోపితే చెనకవోయి
ఆ రీతిఁ బెనఁగవచ్చు నౌఁగాదనరాదు

(॥చేరి॥)
తలఁచవచ్చు నీరూపు తమక మాఁపఁగరాదు
వలవఁగవచ్చు మరి వదలరాదు
కొలువు సేయఁగవచ్చు కూటమి మఱవరాదు
కలయఁగవచ్చు వేడుకలు పట్టరాదు

(॥చేరి॥)
చిప్పిల మాటాడవచ్చు సిగ్గులు వడఁగరాదు
తప్పక చూడగవచ్చు తనియరాదు
కప్పురాన వేయవచ్చు కాఁకల కోరువరాదు
వొప్పుగాఁ బాడఁగవచ్చు వోరుచుకోరాదు

(॥చేరి॥)
పంతముతో నవ్వవచ్చు భావము చెప్పఁగరాదు
మంతన మాడుగవచ్చు మానరాదు
యింతలో శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు
వింతరతి చూపువచ్చు విసుగరాదు

(||pallavi||)
seri nannela nobide sĕnagavoyi
ā rīdim̐ bĕnam̐gavachchu naum̐gādanarādu

(||seri||)
talam̐savachchu nīrūbu tamaga mām̐pam̐garādu
valavam̐gavachchu mari vadalarādu
kŏluvu seyam̐gavachchu kūḍami maṟavarādu
kalayam̐gavachchu veḍugalu paṭṭarādu

(||seri||)
sippila māḍāḍavachchu siggulu vaḍam̐garādu
tappaga sūḍagavachchu taniyarādu
kappurāna veyavachchu kām̐kala koruvarādu
vŏppugām̐ bāḍam̐gavachchu vorusugorādu

(||seri||)
paṁtamudo navvavachchu bhāvamu sĕppam̐garādu
maṁtana māḍugavachchu mānarādu
yiṁtalo śhrīveṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
viṁtaradi sūbuvachchu visugarādu