Seri mokkaro narulu shreemamtumdeedamdu

చేరి మొక్కరో నరులు శ్రీమంతుఁడీతఁడు
Language

(॥పల్లవి॥)
చేరి మొక్కరో నరులు శ్రీమంతుఁడీతఁడు
కోరి వరములిచ్చు కొండవంటి సింహము

(॥చేరి॥)
గద్దెమీఁదఁ గూరుచుండి కనకకసిపుఁ జెండీ
గద్దరి ప్రహ్లదునిపై కరుణనిండీ
వొద్దనె మారుగొండల వువిదయుఁ దాను నుండీ
తిద్దుకొనె మీసాలు దివ్యనారసింహుఁడు

(॥చేరి॥)
భవనాశిదరి దొక్కి బ్రహ్మాదులలోన నిక్కి
తివిరి ప్రతాపమున దిక్కుల కెక్కి
రవళి నారదాదుల రంగుపాటలకుఁ జొక్కి
చెవు లాలించీ నుతులు శ్రీనారసింహుఁడు

(॥చేరి॥)
అదె కంబములోఁ బుట్టి ఆయుధాలు చేతఁ బట్టి
వెదకి అహోబలాన వేడుకఁ బుట్టి
కదిసి శ్రీ వేంకటాద్రికాంతలలో గుంపుగట్టి
వెదచల్లు మహిమల వీరనారసింహుఁడు

(||pallavi||)
seri mŏkkaro narulu śhrīmaṁtum̐ḍīdam̐ḍu
kori varamulichchu kŏṁḍavaṁṭi siṁhamu

(||seri||)
gaddĕmīm̐dam̐ gūrusuṁḍi kanagakasibum̐ jĕṁḍī
gaddari prahladunibai karuṇaniṁḍī
vŏddanĕ mārugŏṁḍala vuvidayum̐ dānu nuṁḍī
tiddugŏnĕ mīsālu divyanārasiṁhum̐ḍu

(||seri||)
bhavanāśhidari dŏkki brahmādulalona nikki
tiviri pradābamuna dikkula kĕkki
ravaḽi nāradādula raṁgubāḍalagum̐ jŏkki
sĕvu lāliṁchī nudulu śhrīnārasiṁhum̐ḍu

(||seri||)
adĕ kaṁbamulom̐ buṭṭi āyudhālu sedam̐ baṭṭi
vĕdagi ahobalāna veḍugam̐ buṭṭi
kadisi śhrī veṁkaḍādrigāṁtalalo guṁpugaṭṭi
vĕdasallu mahimala vīranārasiṁhum̐ḍu