Seri mokkare naamaaru selulaala aadanigi

చేరి మొక్కరే నామారు చెలులాల ఆతనికి
Language

(॥పల్లవి॥)
చేరి మొక్కరే నామారు చెలులాల ఆతనికి
ఆరజము సేయరాదు అవుననరాదు

(॥చేరి॥)
వెల్లవిరాయఁ బనులు వేడుకతోఁ దన్నుఁ జూచి
కొల్లువ నవ్వఁగరాదు కొసరా రాదు
పెల్లునఁ దా నింత చేసి ప్రియములు చెప్పఁగాను
పల్లదమాడఁగరాదు పైకొనరాదు

(॥చేరి॥)
పయ్యదపైఁ జేఇ వేసి బాసలెల్లా నియ్యఁగాను
ఇయ్యకొనరాదు మరి యేఁచఁగరాదు
కొయ్యకాఁడై నాకుఁ గోరి మోవి యొసఁగఁగా
సయ్యాటమాడఁగరాదు జరయ రాదు

(॥చేరి॥)
ఇంతలో శ్రీ వేంకటేశుఁ డేలి నన్నుఁ బొగడఁగ
సంతోసించుకొనరాదు సాదించరాదు
పొంతనే నాతో నెంగిలి పొత్తు దాఁ గలయఁగాను
పంతములాడఁగరాదు పాయఁగరాదు

(||pallavi||)
seri mŏkkare nāmāru sĕlulāla ādanigi
ārajamu seyarādu avunanarādu

(||seri||)
vĕllavirāyam̐ banulu veḍugadom̐ dannum̐ jūsi
kŏlluva navvam̐garādu kŏsarā rādu
pĕllunam̐ dā niṁta sesi priyamulu sĕppam̐gānu
palladamāḍam̐garādu paigŏnarādu

(||seri||)
payyadabaim̐ jei vesi bāsalĕllā niyyam̐gānu
iyyagŏnarādu mari yem̐sam̐garādu
kŏyyagām̐ḍai nāgum̐ gori movi yŏsam̐gam̐gā
sayyāḍamāḍam̐garādu jaraya rādu

(||seri||)
iṁtalo śhrī veṁkaḍeśhum̐ ḍeli nannum̐ bŏgaḍam̐ga
saṁtosiṁchugŏnarādu sādiṁcharādu
pŏṁtane nādo nĕṁgili pŏttu dām̐ galayam̐gānu
paṁtamulāḍam̐garādu pāyam̐garādu