Seri mellane pomdulu seya vachchevu

చేరి మెల్లనె పొందులు సేయ వచ్చేవు
Language

(॥పల్లవి॥)
చేరి మెల్లనె పొందులు సేయ వచ్చేవు
నేరుపుల మాటాడేవు నే మరచితినా

(॥చేరి॥)
అలిగి యప్పుడు నీతో నాడుకొన్నమాఁట లెల్ల
పలుకుఁబంతాలె కాక బతిమాలేనా
చెలిమి నీతో నింకాఁ జేయ వచ్చితేఁ గనక
పలుమారు నీ వప్పుడు పంగించ రాదా

(॥చేరి॥)
చేయి ముట్టి ని న్నప్పడు సేసినట్టిచేఁత లెల్ల
యీయడ దక్కించుకోక యిఁక మానేనా
వోయి నేఁ బ్రియాలు చెప్ప నొగి వచ్చితేఁ గనక
నాయడ చూచి నీవు నవ్వ రాదా

(॥చేరి॥)
కొసరి యప్పుడు నిన్నుఁ గోపించినది యల్లా
పసు రెక్కుఁ గాక యిఁకఁ బంత మిచ్చేనా
యెసగి శ్రీవెంకటేశ యింతలో నన్నుఁ గూడితి
అసము దిగితేఁ గన కప్పుడన రాదా

(||pallavi||)
seri mĕllanĕ pŏṁdulu seya vachchevu
nerubula māḍāḍevu ne marasidinā

(||seri||)
aligi yappuḍu nīdo nāḍugŏnnamām̐ṭa lĕlla
palugum̐baṁtālĕ kāga badimālenā
sĕlimi nīdo niṁkām̐ jeya vachchidem̐ ganaga
palumāru nī vappuḍu paṁgiṁcha rādā

(||seri||)
seyi muṭṭi ni nnappaḍu sesinaṭṭisem̐ta lĕlla
yīyaḍa dakkiṁchugoga yim̐ka mānenā
voyi nem̐ briyālu sĕppa nŏgi vachchidem̐ ganaga
nāyaḍa sūsi nīvu navva rādā

(||seri||)
kŏsari yappuḍu ninnum̐ gobiṁchinadi yallā
pasu rĕkkum̐ gāga yim̐kam̐ baṁta michchenā
yĕsagi śhrīvĕṁkaḍeśha yiṁtalo nannum̐ gūḍidi
asamu digidem̐ gana kappuḍana rādā