Seri mammum joosi yela siggu vadevu

చేరి మమ్ముఁ జూచి యేల సిగ్గు వడేవు
Language

(॥పల్లవి॥)
చేరి మమ్ముఁ జూచి యేల సిగ్గు వడేవు
గారవించితే దోసమా కాంతను నీ విపుడు

(॥॥)
పాలిండ్లు గానరాఁగా పయ్యద గొంత జారఁగా
సోలి విన్నపాలు సేసీ సుదతి
వాలుఁ గన్నులు దేలించి వడి శిరసు సెత్తి చూచి
జాలిఁ గూరిమి గొసరీ చనవియ్యవయ్యా

(॥॥)
చెమటలు గారఁగాను జిగిఁ గళ లుబ్బఁగాను
జమళిఁ బాదా లొత్తీ సకియా
తమ రేఁ చఁ గా వలపు దైలువారఁ గా నవ్వి
సమరతికిఁ బెనఁ గీ సమ్మతించవయ్యా

(॥॥)
కొప్పు పువ్వు లటు రాల కొంకి పోఁకముడి వీడ
నెప్పునఁ గౌఁగిట నించీ నెలఁతా
యిప్పుడే శ్రీ వేంకటేశ యీకెఁగూడి నన్నేలితి
వప్పటి నిన్నాసపడీ నాదరించవయ్యా

(||pallavi||)
seri mammum̐ jūsi yela siggu vaḍevu
gāraviṁchide dosamā kāṁtanu nī vibuḍu

(||||)
pāliṁḍlu gānarām̐gā payyada gŏṁta jāram̐gā
soli vinnabālu sesī sudadi
vālum̐ gannulu deliṁchi vaḍi śhirasu sĕtti sūsi
jālim̐ gūrimi gŏsarī sanaviyyavayyā

(||||)
sĕmaḍalu gāram̐gānu jigim̐ gaḽa lubbam̐gānu
jamaḽim̐ bādā lŏttī sagiyā
tama rem̐ sam̐ gā valabu dailuvāram̐ gā navvi
samaradigim̐ bĕnam̐ gī sammadiṁchavayyā

(||||)
kŏppu puvvu laḍu rāla kŏṁki pom̐kamuḍi vīḍa
nĕppunam̐ gaum̐giḍa niṁchī nĕlam̐tā
yippuḍe śhrī veṁkaḍeśha yīgĕm̐gūḍi nannelidi
vappaḍi ninnāsabaḍī nādariṁchavayyā