చేరి మందెమేళ మెంత సేసేవు మమ్ము
(॥పల్లవి॥)
చేరి మందెమేళ మెంత సేసేవు మమ్ము
మేరకు మేరే కాక మిక్కి లింత చెల్లునా
(॥చేరి॥)
చివ్వన నీ కూడిగాలు సేసేకాంతలలోన
నెవ్వరిఁ బోలుదు నేన న్నేల పట్టేవు
యివ్వల నీ వే మన్న నెదు రాడఁ జాలఁ గాక
దవ్వుల నుండిననన్ను దగ్గరి రాఁ దీతురా
(॥చేరి॥)
అంచెల నీతో నవ్వే యాపాటివారమా
పొంచి నన్ను నెంత సేసి పొగడేవు
ముంచి బలిమి సేయఁగా మోనానల నుండితిఁ గాక
మంచ మెక్కి నీసరుస మాట లాడేదాననా
(॥చేరి॥)
కొంగు వట్టేవు నీకాలిగోరఁ బోరఁ గలనా
యెంగిలి మా మోవితేనె లేల ముట్టేవు
అంగవించి శ్రీవెంకటాదిప కూడితి నన్ను
మంగిటినిధానము వై ముట్టి నన్నుఁ బాయవూ
(||pallavi||)
seri maṁdĕmeḽa mĕṁta sesevu mammu
meragu mere kāga mikki liṁta sĕllunā
(||seri||)
sivvana nī kūḍigālu sesegāṁtalalona
nĕvvarim̐ boludu nena nnela paṭṭevu
yivvala nī ve manna nĕdu rāḍam̐ jālam̐ gāga
davvula nuṁḍinanannu daggari rām̐ dīdurā
(||seri||)
aṁchĕla nīdo navve yābāḍivāramā
pŏṁchi nannu nĕṁta sesi pŏgaḍevu
muṁchi balimi seyam̐gā monānala nuṁḍidim̐ gāga
maṁcha mĕkki nīsarusa māḍa lāḍedānanā
(||seri||)
kŏṁgu vaṭṭevu nīgāligoram̐ boram̐ galanā
yĕṁgili mā movidenĕ lela muṭṭevu
aṁgaviṁchi śhrīvĕṁkaḍādiba kūḍidi nannu
maṁgiḍinidhānamu vai muṭṭi nannum̐ bāyavū