చేరి కరుణించుమంటాఁ జేతులెత్తి మొక్కేవు
(॥పల్లవి॥)
చేరి కరుణించుమంటాఁ జేతులెత్తి మొక్కేవు
యీ రీతి నాతఁడు నిన్ను నేమిసేసెనే
(॥॥)
సన్నపు టెలుఁగునను సళుపుమాట లాడేవు
కన్నులు దేలించుకొంటాఁ గమ్మిచూచేవు
వున్నతిఁజెక్కుచెమట లూరిచి కడఁజల్లేవు
యెన్నఁగ నాతఁడు నిన్ను నేమి సేసెనే
(॥॥)
దప్పి దేరఁ బెదవులపై దైన్యములు చూపేవు
కొప్పు వీడఁజేసుకొని గుబ్బతిలేవు
చిప్పలి విడెమిమ్మంటే చెలిచేత నంపేవు
యిప్పుడే యీతఁడు నీకు నేమి సేసెనే
(॥॥)
వొడివట్టి తీసితేను వుసురంటా నలసేవు
వెడమాయలాఁడివి శ్రీ వేంకటేశుతో
అడరి నన్నితఁ డేలె నలమేల్ మంగను నేను
యెడనెడ నిన్నుఁగూడీ నేమి సేసెనే
(||pallavi||)
seri karuṇiṁchumaṁṭām̐ jedulĕtti mŏkkevu
yī rīdi nādam̐ḍu ninnu nemisesĕne
(||||)
sannabu ṭĕlum̐gunanu saḽubumāḍa lāḍevu
kannulu deliṁchugŏṁṭām̐ gammisūsevu
vunnadim̐jĕkkusĕmaḍa lūrisi kaḍam̐jallevu
yĕnnam̐ga nādam̐ḍu ninnu nemi sesĕne
(||||)
dappi deram̐ bĕdavulabai dainyamulu sūbevu
kŏppu vīḍam̐jesugŏni gubbadilevu
sippali viḍĕmimmaṁṭe sĕliseda naṁpevu
yippuḍe yīdam̐ḍu nīgu nemi sesĕne
(||||)
vŏḍivaṭṭi tīsidenu vusuraṁṭā nalasevu
vĕḍamāyalām̐ḍivi śhrī veṁkaḍeśhudo
aḍari nannidam̐ ḍelĕ nalamel maṁganu nenu
yĕḍanĕḍa ninnum̐gūḍī nemi sesĕne