చేరి ధర్మపుణ్యము నీ చేతిది గాక
(॥పల్లవి॥)
చేరి ధర్మపుణ్యము నీ చేతిది గాక
యీరసాన నిందరిలో నేమనేదిరా
(॥చేరి॥)
కడు మొక్కలాన నీపై కాకఁలు చల్లఁగరాదు
నడుమంతరాల నీతో నవ్వఁగరాదు
విడువ కెందుంటివని వెంగెములాడఁగ రాదు
యెడయలేని సుద్దులకేమనేదిరా
(॥చేరి॥)
నిందలు వేసి నిన్ను నేరములెంచఁగ రాదు
మందెమేళమున మారుమలయ రాదు
కందువకుఁ దీసి నీపై గాతలు చూపఁగరాదు
యెందువల్ల గెలుతు నిన్నేమనేదిరా
(॥చేరి॥)
కొప్పువట్టి తీసి నిన్నుఁ గూరాకు సేయఁగరాదు
యిప్పుడే కూడితి వలయించఁగ రాదు
ముప్పిరి శ్రీవేంకటేశ మొక్కితేఁ దిట్టఁగరాదు
యెప్పటి పంతాలు చెల్లె నేమనేదిరా
(||pallavi||)
seri dharmabuṇyamu nī sedidi gāga
yīrasāna niṁdarilo nemanedirā
(||seri||)
kaḍu mŏkkalāna nībai kāgam̐lu sallam̐garādu
naḍumaṁtarāla nīdo navvam̐garādu
viḍuva kĕṁduṁṭivani vĕṁgĕmulāḍam̐ga rādu
yĕḍayaleni suddulagemanedirā
(||seri||)
niṁdalu vesi ninnu neramulĕṁcham̐ga rādu
maṁdĕmeḽamuna mārumalaya rādu
kaṁduvagum̐ dīsi nībai gādalu sūbam̐garādu
yĕṁduvalla gĕludu ninnemanedirā
(||seri||)
kŏppuvaṭṭi tīsi ninnum̐ gūrāgu seyam̐garādu
yippuḍe kūḍidi valayiṁcham̐ga rādu
muppiri śhrīveṁkaḍeśha mŏkkidem̐ diṭṭam̐garādu
yĕppaḍi paṁtālu sĕllĕ nemanedirā