Seppumani yadiginam jeppadu maado nide

చెప్పుమని యడిగినఁ జెప్పదు మాతో నిదె
Language

(॥పల్లవి॥)
చెప్పుమని యడిగినఁ జెప్పదు మాతో నిదె
చొప్పులు నీకె తెలుసు సోదించుకోవయ్యా

(॥చెప్పు॥)
చిత్తరుపటము చూచి చెలి లోలోఁ దలవూఁచి
చిత్తడిచెమటతోడ సిగ్గువడెను
యిత్తల నీవందులోన నేమి వ్రాసితివో కాని
అత్తి నీవాపనే యింకానడుగవయ్యా

(॥చెప్పు॥)
బొమ్మలపెండెము చూచి పొలఁతి యేమీననక
వుమ్మడినే నవ్వునవ్వుచున్నది యిట్టే
చిమ్ములనేమిభావాలు సేయించితివందులోనె
నెమ్మదినందలిమేలు నీవడుగవయ్యా

(॥చెప్పు॥)
పట్టినసురటి చూచి పడఁతి శ్రీ వెంకటేశ
గట్టితమకాన నిన్నుఁ గాఁగిలించెను
గుట్టుననందేమి మేకులు గడించితివో
అట్టునిటునా పెతలఁపడుగవయ్యా

(||pallavi||)
sĕppumani yaḍiginam̐ jĕppadu mādo nidĕ
sŏppulu nīgĕ tĕlusu sodiṁchugovayyā

(||sĕppu||)
sittarubaḍamu sūsi sĕli lolom̐ dalavūm̐si
sittaḍisĕmaḍadoḍa sigguvaḍĕnu
yittala nīvaṁdulona nemi vrāsidivo kāni
atti nīvābane yiṁkānaḍugavayyā

(||sĕppu||)
bŏmmalabĕṁḍĕmu sūsi pŏlam̐ti yemīnanaga
vummaḍine navvunavvusunnadi yiṭṭe
simmulanemibhāvālu seyiṁchidivaṁdulonĕ
nĕmmadinaṁdalimelu nīvaḍugavayyā

(||sĕppu||)
paṭṭinasuraḍi sūsi paḍam̐ti śhrī vĕṁkaḍeśha
gaṭṭidamagāna ninnum̐ gām̐giliṁchĕnu
guṭṭunanaṁdemi megulu gaḍiṁchidivo
aṭṭuniḍunā pĕdalam̐paḍugavayyā