చెప్పుమనేవు తగవు చెప్పకుండరాదు నాకు
(॥పల్లవి॥)
చెప్పుమనేవు తగవు చెప్పకుండరాదు నాకు
వొప్పుగ వినవలెఁ గాదా వువిద లిద్దరును
(॥॥)
పాయపుదానవు గాన పతిని సొలసి నీవు
ఆయములు సోఁక మాటలాడఁ జెల్లునే
చాయలాను సన్నలాను సవతులఁజూపి చూపి
రాయిడించి పలుకఁగరాదే నీ కిపుడు
(॥॥)
చేసుకొన్న యప్పుడే చెలువునికాఁగిటికి
ఆసపడి బలిమి సేయఁగఁ దగునే
వాసితోడ నీతోడివనితలమీఁదట
రాసికెక్కి చేయిచాఁచరాదు గాని నేఁడు
(॥॥)
చెలిమిగలఁడు నీకు శ్రీవేంకటేశ్వరు
కలయుట సహజమే కాఁగిట నీకు
పలుమారు నీతోడిభామినులముంగిటను
చలవట్టి మురియుచు సందడించ నేఁటికే
(||pallavi||)
sĕppumanevu tagavu sĕppaguṁḍarādu nāgu
vŏppuga vinavalĕm̐ gādā vuvida liddarunu
(||||)
pāyabudānavu gāna padini sŏlasi nīvu
āyamulu som̐ka māḍalāḍam̐ jĕllune
sāyalānu sannalānu savadulam̐jūbi sūbi
rāyiḍiṁchi palugam̐garāde nī kibuḍu
(||||)
sesugŏnna yappuḍe sĕluvunigām̐giḍigi
āsabaḍi balimi seyam̐gam̐ dagune
vāsidoḍa nīdoḍivanidalamīm̐daḍa
rāsigĕkki seyisām̐sarādu gāni nem̐ḍu
(||||)
sĕlimigalam̐ḍu nīgu śhrīveṁkaḍeśhvaru
kalayuḍa sahajame kām̐giḍa nīgu
palumāru nīdoḍibhāminulamuṁgiḍanu
salavaṭṭi muriyusu saṁdaḍiṁcha nem̐ṭige