చెప్పుడుమాటలు గావు చెలువుఁడ నీ సేఁతలు
(॥పల్లవి॥)
చెప్పుడుమాటలు గావు చెలువుఁడ నీ సేఁతలు
చొప్పు దప్పకుండా నేనే చూచితినయ్యా
(॥॥)
యెలిమి నా కెయు నీవు నెదురుబడి నుండి
సెలవుల నవ్వితివి సిగ్గులతోను
తలుపుమాటున నుండి తారుకాణగా నేఁడు
సొలవక నేనే ఇట్టె చూచితినయ్యా
(॥॥)
వోడక మీరిద్దరును వొక్కమంచముపైనుండి
వీడేలు సేసుకొంటిరి వేడుకతోను
నీడలోనే పొంచివుండి నెట్టన మీసరితలు
జోడనగా నేనే చక్కఁ జూచితినయ్యా
(॥॥)
శ్రీవేంకటేశ కాఁగిటఁ జెంది నీ వాకెయు నిట్టె
మోవితేనే లానితిరి ముచ్చటతోను
యీవలికిఁ దీసి నిన్ను నీదే నేనూఁ గూడితి
సోవలుగా నేనే మిమ్ముఁ జూచితినయ్యా
(||pallavi||)
sĕppuḍumāḍalu gāvu sĕluvum̐ḍa nī sem̐talu
sŏppu dappaguṁḍā nene sūsidinayyā
(||||)
yĕlimi nā kĕyu nīvu nĕdurubaḍi nuṁḍi
sĕlavula navvidivi sigguladonu
talubumāḍuna nuṁḍi tārugāṇagā nem̐ḍu
sŏlavaga nene iṭṭĕ sūsidinayyā
(||||)
voḍaga mīriddarunu vŏkkamaṁchamubainuṁḍi
vīḍelu sesugŏṁṭiri veḍugadonu
nīḍalone pŏṁchivuṁḍi nĕṭṭana mīsaridalu
joḍanagā nene sakkam̐ jūsidinayyā
(||||)
śhrīveṁkaḍeśha kām̐giḍam̐ jĕṁdi nī vāgĕyu niṭṭĕ
movidene lānidiri muchchaḍadonu
yīvaligim̐ dīsi ninnu nīde nenūm̐ gūḍidi
sovalugā nene mimmum̐ jūsidinayyā