Seppudumaadale seppugonuda gaaga

చెప్పుడుమాటలే చెప్పుకొనుట గాక
Language

(॥పల్లవి॥)
చెప్పుడుమాటలే చెప్పుకొనుట గాక
చెప్పినట్లఁ దాము సేయ రెవ్వరును

(॥చెప్పు॥)
దొడ్డయినశరీరదోషమైనయట్టి
జడ్డు దొలఁగవేయఁజాల రెవ్వరును
గడ్డబడి యీఁతకాండ్లౌటగాని
వొడ్డునడుమ నీఁద నోపరెవ్వరును

(॥చెప్పు॥)
శ్రీవేంకటేశుపైఁ జిత్త మర్పణ నేసి
యీవిధు లన్నియు నెడయ రెవ్వరును
చావుఁ బుట్టగులేని జన్మముగలసర్వ.-
దేవతామూర్తులై తిరుగ రెవ్వరును

(||pallavi||)
sĕppuḍumāḍale sĕppugŏnuḍa gāga
sĕppinaṭlam̐ dāmu seya rĕvvarunu

(||sĕppu||)
dŏḍḍayinaśharīradoṣhamainayaṭṭi
jaḍḍu dŏlam̐gaveyam̐jāla rĕvvarunu
gaḍḍabaḍi yīm̐tagāṁḍlauḍagāni
vŏḍḍunaḍuma nīm̐da nobarĕvvarunu

(||sĕppu||)
śhrīveṁkaḍeśhubaim̐ jitta marbaṇa nesi
yīvidhu lanniyu nĕḍaya rĕvvarunu
sāvum̐ buṭṭaguleni janmamugalasarva.-
devadāmūrdulai tiruga rĕvvarunu