చెప్పుడుబుద్దు లెందాఁక చిత్తములో నిలిచీనె
(॥పల్లవి॥)
చెప్పుడుబుద్దు లెందాఁక చిత్తములో నిలిచీనె
యిప్పడె నాకుఁగాఁ బ్రియ మేల చెప్పేరే
(॥చెప్పుడు॥)
తగులమి లేకుండతే తలఁపులో తమి లేదు
నగవులు లేకుండితె ననుపూ లేదు
తెగినపనులకును తిరిగి చూచుట రోఁత
యెగసక్కెనకు వాని నేల పిలిచేరె
(॥చెప్పుడు॥)
చూపు నాఁట కుండితేను చుట్టరికమే లేదు
పై పైఁ బదర కుండితే బత్తే లేదు
తీపుల చాలనిమాఁట తిరుగ నాడుక రోఁత
యేపున వానితో మీరు యేల పోరెరే
(॥చెప్పుడు॥)
జంటలు వాసి వుంటె సమ్మతించుటే లేదు
వెంట వెంట రాకుండితో వేడుకే లేదు
నంటుతోడ నన్నుఁ గూడె నమ్మ నిదె రోఁత యింక
యింటిలో శ్రీవెంకటేశు నేల కొసరేరే
(||pallavi||)
sĕppuḍubuddu lĕṁdām̐ka sittamulo nilisīnĕ
yippaḍĕ nāgum̐gām̐ briya mela sĕppere
(||sĕppuḍu||)
tagulami leguṁḍade talam̐pulo tami ledu
nagavulu leguṁḍidĕ nanubū ledu
tĕginabanulagunu tirigi sūsuḍa rom̐ta
yĕgasakkĕnagu vāni nela piliserĕ
(||sĕppuḍu||)
sūbu nām̐ṭa kuṁḍidenu suṭṭarigame ledu
pai paim̐ badara kuṁḍide batte ledu
tībula sālanimām̐ṭa tiruga nāḍuga rom̐ta
yebuna vānido mīru yela porĕre
(||sĕppuḍu||)
jaṁṭalu vāsi vuṁṭĕ sammadiṁchuḍe ledu
vĕṁṭa vĕṁṭa rāguṁḍido veḍuge ledu
naṁṭudoḍa nannum̐ gūḍĕ namma nidĕ rom̐ta yiṁka
yiṁṭilo śhrīvĕṁkaḍeśhu nela kŏsarere