Seppudu buddulu sevi somkeenaa

చెప్పుడు బుద్దులు చెవి సోఁకీనా
Language

(॥పల్లవి॥)
చెప్పుడు బుద్దులు చెవి సోఁకీనా
ముప్పిరి తమకము మొలఁచినది

(॥చెప్పుడు॥)
సొలపుఁ జూపులను సుదతి చూడఁగా
తలఁపున నీకవి తగిలినవి
మలకలమాటలు మరియును నాడఁగ
యేలమి వలపు తలకెక్కినది

(॥చెప్పుడు॥)
నారీమణి చిరునవ్వులు నవ్వఁగ
ఆరీతి నీకవి అందినవి
సారెకు సరసము చవిగా నాడఁగ
పేరడియాసలు పేరినవి

(॥చెప్పుడు॥)
కొమ్మ నిన్నుపుడు గుబ్బల నొత్తఁగ
నమ్మికలైయవి నాటినవి
యిమ్ముల శ్రీ వేంకటేశ నన్నేలఁగ
నెమ్మది రతులివి నిండినవి

(||pallavi||)
sĕppuḍu buddulu sĕvi som̐kīnā
muppiri tamagamu mŏlam̐sinadi

(||sĕppuḍu||)
sŏlabum̐ jūbulanu sudadi sūḍam̐gā
talam̐puna nīgavi tagilinavi
malagalamāḍalu mariyunu nāḍam̐ga
yelami valabu talagĕkkinadi

(||sĕppuḍu||)
nārīmaṇi sirunavvulu navvam̐ga
ārīdi nīgavi aṁdinavi
sārĕgu sarasamu savigā nāḍam̐ga
peraḍiyāsalu perinavi

(||sĕppuḍu||)
kŏmma ninnubuḍu gubbala nŏttam̐ga
nammigalaiyavi nāḍinavi
yimmula śhrī veṁkaḍeśha nannelam̐ga
nĕmmadi radulivi niṁḍinavi