Seppive naa kaa suddi sevulaara vinem gaani

చెప్పివే నా కా సుద్ది చెవులార వినేఁ గాని
Language

(॥పల్లవి॥)
చెప్పివే నా కా సుద్ది చెవులార వినేఁ గాని
కప్పుదేరి నీ మోవి కడు నందమైనది

(॥॥)
జోఱునఁ జెమట గారీ చొక్కపు గుబ్బలవెంట
జాఱీని వీఁపు మీఁద చక్కనికొప్పు
మీఱీఁ గళలు నేఁడు మిక్కిలి నీ మొగమున
ఆఱడి నీ వేఁటి కింత యలసి వున్నదానవే

(॥॥)
అడుగులు దడఁబడీ నందమైన నడవుల
చిడిముడి వదలీ ముంజేతి గాజులు
తొడిఁబడ నొసలికరి బొట్టు చెదరీని
వెడవెడగా నేఁడు వింతయై వున్నదానవే

(॥॥)
కమ్మి చెంపలఁ బూసిన గందపు బేట్లు రాలీ
వుమ్మగిలుఁ బులకలు వుప్పతిల్లీని
నెమ్మి శ్రీ వేంకటేశుఁడు నీ వలమేలుమంగవు
దొమ్మిఁ గూడితిరో మీరు దొరసివున్నారు

(||pallavi||)
sĕppive nā kā suddi sĕvulāra vinem̐ gāni
kappuderi nī movi kaḍu naṁdamainadi

(||||)
joṟunam̐ jĕmaḍa gārī sŏkkabu gubbalavĕṁṭa
jāṟīni vīm̐pu mīm̐da sakkanigŏppu
mīṟīm̐ gaḽalu nem̐ḍu mikkili nī mŏgamuna
āṟaḍi nī vem̐ṭi kiṁta yalasi vunnadānave

(||||)
aḍugulu daḍam̐baḍī naṁdamaina naḍavula
siḍimuḍi vadalī muṁjedi gājulu
tŏḍim̐baḍa nŏsaligari bŏṭṭu sĕdarīni
vĕḍavĕḍagā nem̐ḍu viṁtayai vunnadānave

(||||)
kammi sĕṁpalam̐ būsina gaṁdabu beṭlu rālī
vummagilum̐ bulagalu vuppadillīni
nĕmmi śhrī veṁkaḍeśhum̐ḍu nī valamelumaṁgavu
dŏmmim̐ gūḍidiro mīru dŏrasivunnāru