చెప్పిరాదు మా యాస చేటల కొలఁదులాయ
(॥పల్లవి॥)
చెప్పిరాదు మా యాస చేటల కొలఁదులాయ
ముప్పిరిఁ జూచితి విఁక మోహమెంతో కాని
(॥చెప్పి॥)
చెప్పినమాటలు నీవు చెవి యొగ్గి వింటిని
యిప్పుడె మారుమా టాపె కే మంటివయ్యా
కప్పుర మిచ్చినందుకు గక్కన నవ్వితివి
చిప్పిల నెంతఘనము సేసేవో కాని
(॥చెప్పి॥)
చే యెత్తి మొక్కినందుకు చెప్పితివి ప్రియము
మాయింతి నెట్ల నీవు మన్నించేవయ్యా
నీయింటికి రాఁగానే నెయ్యము చేకొంటివి
కాయ మంటి ఆపె నెంత కలసేవోకాని
(॥చెప్పి॥)
ఇంతి నప్పగించినందు కియ్యకొంటి విపుడు
పంతాన నెట్ల నింతిఁ బాయ కుండేవో
చెంతల శ్రీవేంకటేశ చేకొని కూడితివి
యెంతని యాపెకు లిగిచ్చేవోశాని
(||pallavi||)
sĕppirādu mā yāsa seḍala kŏlam̐dulāya
muppirim̐ jūsidi vim̐ka mohamĕṁto kāni
(||sĕppi||)
sĕppinamāḍalu nīvu sĕvi yŏggi viṁṭini
yippuḍĕ mārumā ṭābĕ ke maṁṭivayyā
kappura michchinaṁdugu gakkana navvidivi
sippila nĕṁtaghanamu sesevo kāni
(||sĕppi||)
se yĕtti mŏkkinaṁdugu sĕppidivi priyamu
māyiṁti nĕṭla nīvu manniṁchevayyā
nīyiṁṭigi rām̐gāne nĕyyamu segŏṁṭivi
kāya maṁṭi ābĕ nĕṁta kalasevogāni
(||sĕppi||)
iṁti nappagiṁchinaṁdu kiyyagŏṁṭi vibuḍu
paṁtāna nĕṭla niṁtim̐ bāya kuṁḍevo
sĕṁtala śhrīveṁkaḍeśha segŏni kūḍidivi
yĕṁtani yābĕgu ligichchevośhāni