చెప్పినవారి బుద్దులు సేయవైతిగా
(॥పల్లవి॥)
చెప్పినవారి బుద్దులు సేయవైతిగా
కప్పురపుమోవెల్లఁ గడు వాడెఁ జుమ్మీ
(॥చెప్ప॥)
దువ్వటపుచంద్రగావి తోప్పదోఁగెఁ జెమటల
నవ్వకుమన్న మానవు నాయకునితో
పువ్వులు గొయకుమంటే పురుషునియెదుటను
చివ్వన మరునమ్ములు చేయినాటకుండునా
(॥చెప్ప॥)
గాఁటపునిట్టూర్పులు కసిరితేఁ బతితోడ
మాటలాడమకున్నాను మానవైతిగా
మేఁటితురుమెల్లా జారె మిక్కిలిరమణునితో
వాటపుసరసములు వద్దంటిఁగా
(॥చెప్ప॥)
పూసినకుంకుమపూఁత పులకలఁ బేట్లెతై
ఆసలఁ బ్రాణేశ్వరు నంటుకోఁగాను
మేసులఁ బరవశము మీఁదమీఁద నబ్బె నదె
బాసల శ్రీవేంకటేశుఁ బై కొనితే నంటిఁగా
(||pallavi||)
sĕppinavāri buddulu seyavaidigā
kappurabumovĕllam̐ gaḍu vāḍĕm̐ jummī
(||sĕppa||)
duvvaḍabusaṁdragāvi toppadom̐gĕm̐ jĕmaḍala
navvagumanna mānavu nāyagunido
puvvulu gŏyagumaṁṭe puruṣhuniyĕduḍanu
sivvana marunammulu seyināḍaguṁḍunā
(||sĕppa||)
gām̐ṭabuniṭṭūrbulu kasiridem̐ badidoḍa
māḍalāḍamagunnānu mānavaidigā
mem̐ṭidurumĕllā jārĕ mikkiliramaṇunido
vāḍabusarasamulu vaddaṁṭim̐gā
(||sĕppa||)
pūsinaguṁkumabūm̐ta pulagalam̐ beṭlĕdai
āsalam̐ brāṇeśhvaru naṁṭugom̐gānu
mesulam̐ baravaśhamu mīm̐damīm̐da nabbĕ nadĕ
bāsala śhrīveṁkaḍeśhum̐ bai kŏnide naṁṭim̐gā