Seppinattu seyave seluvunigi

చెప్పినట్టు సేయవే చెలువునికి
Language

(॥పల్లవి॥)
చెప్పినట్టు సేయవే చెలువునికి
కప్పురపు నవ్వులనే కరఁగీ నీ యెదుట

(॥చెప్పినట్టు॥)
మాఁటాడితే వెంగెమే మగుడి చూచేచూపులు
గాఁటముగ రాలేటి కామునమ్ములు
యేఁటికి నింత సేసేవే యెంత నేరుచుకొంటివే
చోటిమ్మంటా రమణుఁడు సొలసీని నిన్నును

(॥చెప్పినట్టు॥)
పట్టితేను తప్పులే పై పై సన్న సేసితే
జట్టిగొన్న కనుబొమ్మ జంకెనలే
రట్టుపెట్టే విదియేమే ఇట్టె రాజసముతోడ
పట్టుమంటా వీడెమిచ్చి బ్రమయించీ విభుఁడు

(॥చెప్పినట్టు॥)
మేలమాడితే నెమ్మెలే మిగుల నేకతమైతే
కోలుముందైన రతుల కోలాహలమే
మేలుదాన వౌదువే మించుఁ బట్టపురాణివే
చాలి శ్రీవేంకటేశుఁడు చనవిచ్చీ నిపుడు

(||pallavi||)
sĕppinaṭṭu seyave sĕluvunigi
kappurabu navvulane karam̐gī nī yĕduḍa

(||sĕppinaṭṭu||)
mām̐ṭāḍide vĕṁgĕme maguḍi sūsesūbulu
gām̐ṭamuga rāleḍi kāmunammulu
yem̐ṭigi niṁta seseve yĕṁta nerusugŏṁṭive
soḍimmaṁṭā ramaṇum̐ḍu sŏlasīni ninnunu

(||sĕppinaṭṭu||)
paṭṭidenu tappule pai pai sanna seside
jaṭṭigŏnna kanubŏmma jaṁkĕnale
raṭṭubĕṭṭe vidiyeme iṭṭĕ rājasamudoḍa
paṭṭumaṁṭā vīḍĕmichchi bramayiṁchī vibhum̐ḍu

(||sĕppinaṭṭu||)
melamāḍide nĕmmĕle migula negadamaide
kolumuṁdaina radula kolāhalame
meludāna vauduve miṁchum̐ baṭṭaburāṇive
sāli śhrīveṁkaḍeśhum̐ḍu sanavichchī nibuḍu