చెప్పినట్టు సేయవయ్య చెలియ చిత్తమురాను
(॥పల్లవి॥)
చెప్పినట్టు సేయవయ్య చెలియ చిత్తమురాను
దప్పిదేర బుజ్జగించి తనివందవయ్యా
(॥చెప్పి॥)
చిగురుఁబోణీ నిన్ను శ(సె?) లవుల నవ్వీవి
జిగి నీవెక్కడ నేమి సేసితివయ్యా
తగిలి నీనిలువెల్లాఁ దప్పకచూచీ నిదె
యెగసక్కెపుమచ్చము లేమున్నవయ్యా
(॥చెప్పి॥)
కచ్చుపెట్టి నీకు నట్టె కస్తూరి వూసీని
పచ్చిగా నెవ్వతెతావి పట్టెనయ్యా
దిచ్చరినీమోవి గలతేనెతీపు చాలదని
వెచ్చ మేడఁబెట్టి కొంత తెచ్చితివయ్యా
(॥చెప్పి॥)
శ్రీవేంకటేశ నిన్నుఁ జేరి కాఁగిలించి కూడె
కావించి నీనిజ మెట్టు కనెనయ్యా
వోవరిగాఁ దనకు నీవురము నెలవుచేసె
భావమెఱింగి రతెట్టు పనిగొనెనయ్యా
(||pallavi||)
sĕppinaṭṭu seyavayya sĕliya sittamurānu
dappidera bujjagiṁchi tanivaṁdavayyā
(||sĕppi||)
sigurum̐boṇī ninnu śha(sĕ?) lavula navvīvi
jigi nīvĕkkaḍa nemi sesidivayyā
tagili nīniluvĕllām̐ dappagasūsī nidĕ
yĕgasakkĕbumachchamu lemunnavayyā
(||sĕppi||)
kachchubĕṭṭi nīgu naṭṭĕ kastūri vūsīni
pachchigā nĕvvadĕdāvi paṭṭĕnayyā
dichcharinīmovi galadenĕdību sāladani
vĕchcha meḍam̐bĕṭṭi kŏṁta tĕchchidivayyā
(||sĕppi||)
śhrīveṁkaḍeśha ninnum̐ jeri kām̐giliṁchi kūḍĕ
kāviṁchi nīnija mĕṭṭu kanĕnayyā
vovarigām̐ danagu nīvuramu nĕlavusesĕ
bhāvamĕṟiṁgi radĕṭṭu panigŏnĕnayyā