Seppinattu seyanaa sellambo nenu

చెప్పినట్టు సేయనా చెల్లఁబో నేను
Language

(॥పల్లవి॥)
చెప్పినట్టు సేయనా చెల్లఁబో నేను
కప్పురమిచ్చి యేల కాఁక రేఁచీనే

(॥చెప్ప॥)
వింతవింతమాట లాడి వేడుకవాటలు వాడి
యెంతేసీ సేసి నన్ను నెలయించీనే
మంతనానఁ గూచుండి మర్మములు ముట్టిముట్టి
దొంతి వెట్టి వలుపేల తూరుపెత్తీనే

(॥చెప్ప॥)
సారెసారె నన్నుఁ జూచి చక్కఁదనాలకు లాచి
మేరమీరి నాతోనేల మేకు సేసీనే
నేరుపుతో నవ్వినవ్వి నెయ్యముల చల్లి చల్లి
గోరగీరి వావులేల కుప్ప సేసీనే

(॥చెప్ప॥)
వచ్చివచ్చి కాఁగిలించి వాడికలెల్లా నించి
మెచ్చిమెచ్చి నాతో నెంత మేలమాడీనే
యిచ్చట శ్రీవేంకటేశుఁ డే నలమేలుమంగను
కొచ్చికూడి రతులేల గుదిగుచ్చీనే

(||pallavi||)
sĕppinaṭṭu seyanā sĕllam̐bo nenu
kappuramichchi yela kām̐ka rem̐sīne

(||sĕppa||)
viṁtaviṁtamāḍa lāḍi veḍugavāḍalu vāḍi
yĕṁtesī sesi nannu nĕlayiṁchīne
maṁtanānam̐ gūsuṁḍi marmamulu muṭṭimuṭṭi
dŏṁti vĕṭṭi valubela tūrubĕttīne

(||sĕppa||)
sārĕsārĕ nannum̐ jūsi sakkam̐danālagu lāsi
meramīri nādonela megu sesīne
nerubudo navvinavvi nĕyyamula salli salli
goragīri vāvulela kuppa sesīne

(||sĕppa||)
vachchivachchi kām̐giliṁchi vāḍigalĕllā niṁchi
mĕchchimĕchchi nādo nĕṁta melamāḍīne
yichchaḍa śhrīveṁkaḍeśhum̐ ḍe nalamelumaṁganu
kŏchchigūḍi radulela gudiguchchīne