Seppinattu sesemgaani selivi neevu

చెప్పినట్టు సేసేఁగాని చెలివి నీవు
Language

(॥పల్లవి॥)
చెప్పినట్టు సేసేఁగాని చెలివి నీవు
కుప్పళించీ నా వలపు కొంత నాననీవే

(॥చెప్పి॥)
పెనఁగేటి విభునితో బిగియఁగరాదు నేను
చనవు గడు నిచ్చితే చలము వోదు
వెనుకొని నీవేల వేఁడుకొనే విటు నన్ను
తనుఁదానే నాయకుఁడు దండకు రానీవే

(॥చెప్పి॥)
చెక్కునొక్కి పతితోడ సిగ్గువడరాదు నాకు
యిక్కడ నే నియ్యకొంటే యీసు దీరదు
వొక్కమాఁటే నన్నేల వొడఁబరచేవే యింత
తక్కించీనా యీతఁడే తమకించనీవే

(॥చెప్పి॥)
కూడిన శ్రీ వేంకటేశుఁ గొంగువట్టరాదు నాకు
యీడైతి అలమేల్మంగ నెదురు లేదు
వేడుకాయ ఇఁకనేల వేసరించేవే నీవు
వీడెపుమో వితనికి విందువెట్టనీవే

(||pallavi||)
sĕppinaṭṭu sesem̐gāni sĕlivi nīvu
kuppaḽiṁchī nā valabu kŏṁta nānanīve

(||sĕppi||)
pĕnam̐geḍi vibhunido bigiyam̐garādu nenu
sanavu gaḍu nichchide salamu vodu
vĕnugŏni nīvela vem̐ḍugŏne viḍu nannu
tanum̐dāne nāyagum̐ḍu daṁḍagu rānīve

(||sĕppi||)
sĕkkunŏkki padidoḍa sigguvaḍarādu nāgu
yikkaḍa ne niyyagŏṁṭe yīsu dīradu
vŏkkamām̐ṭe nannela vŏḍam̐baraseve yiṁta
takkiṁchīnā yīdam̐ḍe tamagiṁchanīve

(||sĕppi||)
kūḍina śhrī veṁkaḍeśhum̐ gŏṁguvaṭṭarādu nāgu
yīḍaidi alamelmaṁga nĕduru ledu
veḍugāya im̐kanela vesariṁcheve nīvu
vīḍĕbumo vidanigi viṁduvĕṭṭanīve