చెప్పినట్టు సేసేఁ గాక చేపట్టి పెనఁగ నేల
(॥పల్లవి॥)
చెప్పినట్టు సేసేఁ గాక చేపట్టి పెనఁగ నేల
కప్పుర మిచ్చేవు నాకు కానీ లేవయ్యా
(॥॥)
సలిగెలు చూపేవారు సణఁగులు చల్లేవారు
చెలిమి సేసేనతులు శేనాశేన
నిలిచి నాతో నవ్వేవు నే నేమి బాఁతి నీకు
వెలయ నా చెక్కు నొక్కి వేఁడుకో నేలయ్యా
(॥॥)
తప్పక చూచేటివారు తమి నీకు రేఁచేవారు
కొప్పు దువ్వేటి కాంతలు కోటానఁ గోటి
నెప్పునఁ జన్ను లంటేవు నీ సరిదాననా నేను
ఇప్పుడే మందెమేళాలు యేల మరసేవయ్యా
(॥॥)
గద్దించి కూడేవారు కానుక లిచ్చేవారు
వొద్ద నుండే చెలులు తండోప తండాలు
అద్దుక శ్రీ వేంకటేశ అలమేల్మంగను నేను
పెద్దగాఁ గూడితి వింత ప్రియపడ నేలయ్యా
(||pallavi||)
sĕppinaṭṭu sesem̐ gāga sebaṭṭi pĕnam̐ga nela
kappura michchevu nāgu kānī levayyā
(||||)
saligĕlu sūbevāru saṇam̐gulu sallevāru
sĕlimi sesenadulu śhenāśhena
nilisi nādo navvevu ne nemi bām̐ti nīgu
vĕlaya nā sĕkku nŏkki vem̐ḍugo nelayyā
(||||)
tappaga sūseḍivāru tami nīgu rem̐sevāru
kŏppu duvveḍi kāṁtalu koḍānam̐ goḍi
nĕppunam̐ jannu laṁṭevu nī saridānanā nenu
ippuḍe maṁdĕmeḽālu yela marasevayyā
(||||)
gaddiṁchi kūḍevāru kānuga lichchevāru
vŏdda nuṁḍe sĕlulu taṁḍoba taṁḍālu
adduga śhrī veṁkaḍeśha alamelmaṁganu nenu
pĕddagām̐ gūḍidi viṁta priyabaḍa nelayyā