చెప్పినట్టు సేసీఁగాని సిగ్గులువడితేఁ గాదు
(॥పల్లవి॥)
చెప్పినట్టు సేసీఁగాని సిగ్గులువడితేఁ గాదు
పిప్పిగట్ట మోవియాని ప్రియమెల్లాఁ జెప్పుమా
(॥చెప్పి॥)
మంతనాన నుండరాదా మాఁటలాడీ నాపె దానె
బంతి నిందరిలోనైతేఁ బలుక దాపె
చెంతఁ గొలువునెల్లా చేతుల వేండుకొనేది
పంతమిచ్చి వోవరిలో పాదాలు వేఁడుకొమ్మా
(॥చెప్పి॥)
మనసు నమ్మించరాదా మగువ నీకు లోనయ్యీ
తనువెంత నిమిరినాఁ దరల దాపె
మునుప నీమోవియాకు ముదితకు నిచ్చేది
వెనక నాపెమో వేకు వెస నందుకొమ్మా
(॥చెప్పి॥)
గుట్టుతో నుండఁగరాదా కూడె ని న్నలమేల్మంగ
వొట్టిరట్టు సేయఁబోతే వోరువదాపె
దిట్ట శ్రీవేంకటేశ తెఱవ కుంగలమిచ్చి
మట్టె నీవు తీసుకొని మచ్చిక చేసుకొమ్మా
(||pallavi||)
sĕppinaṭṭu sesīm̐gāni sigguluvaḍidem̐ gādu
pippigaṭṭa moviyāni priyamĕllām̐ jĕppumā
(||sĕppi||)
maṁtanāna nuṁḍarādā mām̐ṭalāḍī nābĕ dānĕ
baṁti niṁdarilonaidem̐ baluga dābĕ
sĕṁtam̐ gŏluvunĕllā sedula veṁḍugŏnedi
paṁtamichchi vovarilo pādālu vem̐ḍugŏmmā
(||sĕppi||)
manasu nammiṁcharādā maguva nīgu lonayyī
tanuvĕṁta nimirinām̐ darala dābĕ
munuba nīmoviyāgu mudidagu nichchedi
vĕnaga nābĕmo vegu vĕsa naṁdugŏmmā
(||sĕppi||)
guṭṭudo nuṁḍam̐garādā kūḍĕ ni nnalamelmaṁga
vŏṭṭiraṭṭu seyam̐bode voruvadābĕ
diṭṭa śhrīveṁkaḍeśha tĕṟava kuṁgalamichchi
maṭṭĕ nīvu tīsugŏni machchiga sesugŏmmā