చెప్పినట్టు సేసే నిఁకఁ జేతికి లోనైతిని
(॥పల్లవి॥)
చెప్పినట్టు సేసే నిఁకఁ జేతికి లోనైతిని
చప్పుడు సేయకు మిఁక సటలకు నోపను
(॥చెప్పి॥)
నవ్వులెంత నవ్వేవు నానాసతులఁ గూడి
రవ్వలెల్లం జేసితిని(వి?) రపమాయను
తవ్వకు తొల్లిటిపొందు తడవాయ నిఁకనేల
జవ్వనము జాలువారీ సటలకు నోపను
(॥చెప్పి॥)
మాట లెఁదాఁకా నాడేవు మగువల ఇండ్లు చొచ్చి
పాటించితిని దూరు నీపాలాయను
వాటము సేయకు బాస వడిఁబడీ విఁకనేల
సాటివచ్చె సుద్దులెల్లా సటలకు నోపను
(॥చెప్పి॥)
చూపులేమి చూచేవు సుదతుల వెంటఁ దెచ్చి
కాఁపురా లీడేర్చితివి కతలాయను
రాపుగ శ్రీవేంకటేశ రతి నన్నుఁగూడితివి
చాపలము నీకేడది సటలకు నోపను
(||pallavi||)
sĕppinaṭṭu sese nim̐kam̐ jedigi lonaidini
sappuḍu seyagu mim̐ka saḍalagu nobanu
(||sĕppi||)
navvulĕṁta navvevu nānāsadulam̐ gūḍi
ravvalĕllaṁ jesidini(vi?) rabamāyanu
tavvagu tŏlliḍibŏṁdu taḍavāya nim̐kanela
javvanamu jāluvārī saḍalagu nobanu
(||sĕppi||)
māḍa lĕm̐dām̐kā nāḍevu maguvala iṁḍlu sŏchchi
pāḍiṁchidini dūru nībālāyanu
vāḍamu seyagu bāsa vaḍim̐baḍī vim̐kanela
sāḍivachchĕ suddulĕllā saḍalagu nobanu
(||sĕppi||)
sūbulemi sūsevu sudadula vĕṁṭam̐ dĕchchi
kām̐purā līḍersidivi kadalāyanu
rābuga śhrīveṁkaḍeśha radi nannum̐gūḍidivi
sābalamu nīgeḍadi saḍalagu nobanu