చెప్పినట్టు సేతుఁగాక చింతలు నాకిఁకనేల
(॥పల్లవి॥)
చెప్పినట్టు సేతుఁగాక చింతలు నాకిఁకనేల
పట్టిన చలములకుఁ బగదాననా
(॥చెప్ప॥)
మాఁటలు నీవాడఁగాను మంకులు నాకిఁకనేల
నాఁటకపు సెలవుల నవ్వుదుఁగాక
యేఁటికి నొడఁబరచే వెడమాటలను నన్ను
గాఁటాన నీతో నలిగి కట్టుకొనేదేమి
(॥చెప్ప॥)
వలపులు చల్లఁగాను వాదులు నాకిఁకనేల
బలిమినైన నీ కొంగు పట్టుదుఁగాక
వలదు నీ కింతయేల పట్టియానలెల్లా నేడుఁ
సళిపి నిన్నిందువంక సాదించేదేమి
(॥చెప్ప॥)
చేరి నీవు గూడఁగాను సిగ్గులు నా కిఁకనేల
గారాబు నీరతులెల్ల కైకొంటిఁగాక
వేరులేదు మనకు శ్రీ వేంకటేశ మెచ్చేవు
దూరి నిన్ను నిందులోనే దొమ్మిసేసేనా
(||pallavi||)
sĕppinaṭṭu sedum̐gāga siṁtalu nāgim̐kanela
paṭṭina salamulagum̐ bagadānanā
(||sĕppa||)
mām̐ṭalu nīvāḍam̐gānu maṁkulu nāgim̐kanela
nām̐ṭagabu sĕlavula navvudum̐gāga
yem̐ṭigi nŏḍam̐barase vĕḍamāḍalanu nannu
gām̐ṭāna nīdo naligi kaṭṭugŏnedemi
(||sĕppa||)
valabulu sallam̐gānu vādulu nāgim̐kanela
baliminaina nī kŏṁgu paṭṭudum̐gāga
valadu nī kiṁtayela paṭṭiyānalĕllā neḍum̐
saḽibi ninniṁduvaṁka sādiṁchedemi
(||sĕppa||)
seri nīvu gūḍam̐gānu siggulu nā kim̐kanela
gārābu nīradulĕlla kaigŏṁṭim̐gāga
veruledu managu śhrī veṁkaḍeśha mĕchchevu
dūri ninnu niṁdulone dŏmmisesenā