Seppinattu sedugaaga seluvuniyeda neevu

చెప్పినట్టు సేతుగాక చెలువునియెడ నీవు
Language

(॥పల్లవి॥)
చెప్పినట్టు సేతుగాక చెలువునియెడ నీవు
ముప్పిరిఁ బెనగుదురా మోహించినదానవు

(॥చెప్పి॥)
వొగ్గి నీరమణుఁడిదె వొడివట్టు కుండఁగాను
సిగ్గులేలే చింతలేలే చెల్లఁబో నీకు
దగ్గరఁ గూచుండి తానే తతి నిన్ను వేఁడుకోఁగా
యెగ్గులేలే యెమ్మెలేలే యింకా నీకు

(॥చెప్పి॥)
పలుకుల నీవిభుఁడు పాలార్చఁగా నిన్ను
అలుకేలే కలఁకేలే అద్దో నీకు
నిలుచుండి యాతఁడు నిన్ను నొడఁబరచఁగా
చలమేలే బలిమేలే సారెసారె నీకు

(॥చెప్పి॥)
కడు శ్రీవేంకటేశుఁడు కాఁగిలించుకుండఁగాను
తడవేలే గొడవేలే తగవా నీకు
అడరి యలమేల్మంగవని నిన్నుఁ గూడె నేఁడు
బెడసేలే గడుసేలే ప్రియురాల నీకు

(||pallavi||)
sĕppinaṭṭu sedugāga sĕluvuniyĕḍa nīvu
muppirim̐ bĕnagudurā mohiṁchinadānavu

(||sĕppi||)
vŏggi nīramaṇum̐ḍidĕ vŏḍivaṭṭu kuṁḍam̐gānu
siggulele siṁtalele sĕllam̐bo nīgu
daggaram̐ gūsuṁḍi tāne tadi ninnu vem̐ḍugom̐gā
yĕggulele yĕmmĕlele yiṁkā nīgu

(||sĕppi||)
palugula nīvibhum̐ḍu pālārsam̐gā ninnu
alugele kalam̐kele addo nīgu
nilusuṁḍi yādam̐ḍu ninnu nŏḍam̐barasam̐gā
salamele balimele sārĕsārĕ nīgu

(||sĕppi||)
kaḍu śhrīveṁkaḍeśhum̐ḍu kām̐giliṁchuguṁḍam̐gānu
taḍavele gŏḍavele tagavā nīgu
aḍari yalamelmaṁgavani ninnum̐ gūḍĕ nem̐ḍu
bĕḍasele gaḍusele priyurāla nīgu