చెప్పినట్టెల్లాఁ జేసి చేకొని మన్నించుఁగాక
(॥పల్లవి॥)
చెప్పినట్టెల్లాఁ జేసి చేకొని మన్నించుఁగాక
వొప్పుగ నీపొందు మాని వూరకుండఁగలఁడా
(॥॥)
కామించి నీపై వలవు గలిగిన రమణుఁడు
యేమే నీమాటకు యెదురాడీనా
గోమున నీరాకలే కోరుక వుండె నిందాఁకా
భామరో యీవేళను పరాకుసేసీనా
(॥॥)
పలుమారు నీకును బాసలిచ్చిన విభుఁడు
తలఁచుకొనక యిట్టె తక్కించీనా
యెలమి నీకాఁగిటికి యెదురు చూచె నిందాఁ కా
తలకొని యేలుఁ గాకా తామరచీనా
(॥॥)
చిత్తగించి నీపాలిటి శ్రీ వేంకటేశుఁడు
కొత్తగా భోగించుఁ గాక గుట్టు చూపీనా
బత్తినేసి బాగాలిచ్చె నిందాఁకా
హత్తి రతిఁ జొక్కించుఁగా కారడి బెట్టినా
(||pallavi||)
sĕppinaṭṭĕllām̐ jesi segŏni manniṁchum̐gāga
vŏppuga nībŏṁdu māni vūraguṁḍam̐galam̐ḍā
(||||)
kāmiṁchi nībai valavu galigina ramaṇum̐ḍu
yeme nīmāḍagu yĕdurāḍīnā
gomuna nīrāgale koruga vuṁḍĕ niṁdām̐kā
bhāmaro yīveḽanu parāgusesīnā
(||||)
palumāru nīgunu bāsalichchina vibhum̐ḍu
talam̐sugŏnaga yiṭṭĕ takkiṁchīnā
yĕlami nīgām̐giḍigi yĕduru sūsĕ niṁdām̐ kā
talagŏni yelum̐ gāgā tāmarasīnā
(||||)
sittagiṁchi nībāliḍi śhrī veṁkaḍeśhum̐ḍu
kŏttagā bhogiṁchum̐ gāga guṭṭu sūbīnā
battinesi bāgālichchĕ niṁdām̐kā
hatti radim̐ jŏkkiṁchum̐gā kāraḍi bĕṭṭinā