Seppinattellaa vimtem jesum bo taanu

చెప్పినట్టెల్లా వింటేఁ జేసుఁ బో తాను
Language

(॥పల్లవి॥)
చెప్పినట్టెల్లా వింటేఁ జేసుఁ బో తాను
యిప్పటనుంటీ నేల యిఁకవిూదఁ గాకా

(॥చెప్పిన॥)
కానీ లేవే యందు కేమి కైతలకు వచ్చెనా, నే
నానుపుమాట లాడితే నవ్వుఁబో, తాను
మాన నీవే యేరుపడ మానితే నేఁగా దనేనా
కోనలఁ గమ్మర వేఁడుకొనవద్దు గాకా

(॥చెప్పిన॥)
చాలు లేవే యింతలోనే సన్నలకు వచ్చెనా, నేఁ
బోలిక లెఱుఁగకున్న బొంకుఁబో, తాను
మేలులే తా నం దెవ్వరిమే నంటినాఁ గాఁదనేనా
వాలి యా యెంగలితో రావద్దనేఁ గాకా

(॥చెప్పిన॥)
ఆడనే వినయము లందులకు వచ్చెనా
మేడలో నేనొంటి నుంటే మీఱుఁ బో, తాను
వేడుకల యింతలో శ్రీవేంకటేశుఁ డిట్లు గూడె
పాడి పంతా లెంచ నేల బడినుండుఁ గాకా

(||pallavi||)
sĕppinaṭṭĕllā viṁṭem̐ jesum̐ bo tānu
yippaḍanuṁṭī nela yim̐kaviూdam̐ gāgā

(||sĕppina||)
kānī leve yaṁdu kemi kaidalagu vachchĕnā, ne
nānubumāḍa lāḍide navvum̐bo, tānu
māna nīve yerubaḍa mānide nem̐gā danenā
konalam̐ gammara vem̐ḍugŏnavaddu gāgā

(||sĕppina||)
sālu leve yiṁtalone sannalagu vachchĕnā, nem̐
boliga lĕṟum̐gagunna bŏṁkum̐bo, tānu
melule tā naṁ dĕvvarime naṁṭinām̐ gām̐danenā
vāli yā yĕṁgalido rāvaddanem̐ gāgā

(||sĕppina||)
āḍane vinayamu laṁdulagu vachchĕnā
meḍalo nenŏṁṭi nuṁṭe mīṟum̐ bo, tānu
veḍugala yiṁtalo śhrīveṁkaḍeśhum̐ ḍiṭlu gūḍĕ
pāḍi paṁtā lĕṁcha nela baḍinuṁḍum̐ gāgā