Seppinattellaa nemdu sedurugaaga

చెప్పినట్టెల్లా నేఁడు సేతురుగాక
Language

(॥పల్లవి॥)
చెప్పినట్టెల్లా నేఁడు సేతురుగాక
దుప్పటి గప్పఁగా నీవు దూరుదురా

(॥॥)
సరసపు మాటలెల్లా చవి సేసుకొంటగాక
వెరవుగా నెరసులు వెదుకుదురా
పరగ నన్నిటా నీవు పట్టపు దేవులవు
వొరసి పిలువఁగాను వూరకుందురా

(॥॥)
నవ్విననవ్వుల కెల్లా ననిచి వోర్చుటగాక
రవ్వగా నెగ్గులు వట్టి రచ్చవేతురా
మువ్వురలోపల నీవు మోహపు గామినివి
పవ్వళించు మనఁగాను పరాకుసేతురా

(॥॥)
చెనకి నిన్నుఁ గూడఁగా చెలరేఁగుదురు గాక
పెనఁగుచు సిగ్గులింత పెంచఁ జూతురా
అనిశముఁ బాయరాని అలమేల్మంగవు నీవు
యెనసె శ్రీ వేంకటేశుఁ డేతువ వెత్తుదురా

(||pallavi||)
sĕppinaṭṭĕllā nem̐ḍu sedurugāga
duppaḍi gappam̐gā nīvu dūrudurā

(||||)
sarasabu māḍalĕllā savi sesugŏṁṭagāga
vĕravugā nĕrasulu vĕdugudurā
paraga nanniḍā nīvu paṭṭabu devulavu
vŏrasi piluvam̐gānu vūraguṁdurā

(||||)
navvinanavvula kĕllā nanisi vorsuḍagāga
ravvagā nĕggulu vaṭṭi rachchavedurā
muvvuralobala nīvu mohabu gāminivi
pavvaḽiṁchu manam̐gānu parāgusedurā

(||||)
sĕnagi ninnum̐ gūḍam̐gā sĕlarem̐guduru gāga
pĕnam̐gusu sigguliṁta pĕṁcham̐ jūdurā
aniśhamum̐ bāyarāni alamelmaṁgavu nīvu
yĕnasĕ śhrī veṁkaḍeśhum̐ ḍeduva vĕttudurā