Seppinatte seyavayya seligi neevu

చెప్పినట్టె సేయవయ్య చెలికి నీవు
Language

(॥పల్లవి॥)
చెప్పినట్టె సేయవయ్య చెలికి నీవు
చిప్పిలి నీ వుద్దండాలు సేయకువయ్యా

(॥చెప్పి॥)
కంతునియమ్ము లవిగో కాంతకొప్పులో నున్నవి
పంతగాఁడ వాతురుముపట్టకువయ్య
చెంతలఁ బెదవు లవి చిగురుటడిదములు
అంతేసిమాటలు నీ వాడించుకోకువయ్యా

(॥చెప్పి॥)
చందురువిషములు సతి నవ్వులలో నవె
కిందుపడాపెచెక్కులు గిల్లకువయ్య
కందువఁ బయ్యదదె జక్కవలకొడ్డినవల
దిందుపడ నీవు ముట్టి తియ్యకువయ్యా

(॥చెప్పి॥)
చలిగాలినాములు సతిమేనివాసనలు
కలసితి విఁక బెళకకువయ్యా
అలమేలుమంగ యీకె అన్నిటా శ్రీవేంకటేశ
కలకాలమును నబ్బెఁగైకొనవయ్యా

(||pallavi||)
sĕppinaṭṭĕ seyavayya sĕligi nīvu
sippili nī vuddaṁḍālu seyaguvayyā

(||sĕppi||)
kaṁtuniyammu lavigo kāṁtagŏppulo nunnavi
paṁtagām̐ḍa vādurumubaṭṭaguvayya
sĕṁtalam̐ bĕdavu lavi siguruḍaḍidamulu
aṁtesimāḍalu nī vāḍiṁchugoguvayyā

(||sĕppi||)
saṁduruviṣhamulu sadi navvulalo navĕ
kiṁdubaḍābĕsĕkkulu gillaguvayya
kaṁduvam̐ bayyadadĕ jakkavalagŏḍḍinavala
diṁdubaḍa nīvu muṭṭi tiyyaguvayyā

(||sĕppi||)
saligālināmulu sadimenivāsanalu
kalasidi vim̐ka bĕḽagaguvayyā
alamelumaṁga yīgĕ anniḍā śhrīveṁkaḍeśha
kalagālamunu nabbĕm̐gaigŏnavayyā