చెప్పినట్టె నీ సేవ సేసేఁగాక
(॥పల్లవి॥)
చెప్పినట్టె నీ సేవ సేసేఁగాక
ఇప్పు డిందరిలోనా నేఁటి బాసలయ్యా
(॥చెప్పి॥)
పచ్చిదేరెఁ బనులెల్లా పడఁతి నీవద్ద నదె
విచ్చనవిడాయ నిఁక వెరపులేదు
మచ్చికలు మేన నవె మరఁగున దాఁచరాదు
యెచ్చుకుందు లేదు యిఁక నేఁటి బాసలయ్యా
(॥చెప్పి॥)
వెల్లవిరాయఁ జేఁతలు వీడె మిచ్చీ నాపె నీకు
తొల్లి నీ కోరినట్టాయ దొరకె మేలు
కల్లలెల్లా నిజమాయ కద్దులోలనఁగరాదు
యెల్లవారు గన్నపని కేఁటి బాసలయ్యా
(॥చెప్పి॥)
పట్టిన పంతాము చెల్లె పారము లొత్తీ నాపె
చుట్టరిక మీడేరె సోదించనేల
యిట్టె శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు
యెట్టయిన మేలె యిఁక నేఁటి బాసలయ్యా
(||pallavi||)
sĕppinaṭṭĕ nī seva sesem̐gāga
ippu ḍiṁdarilonā nem̐ṭi bāsalayyā
(||sĕppi||)
pachchiderĕm̐ banulĕllā paḍam̐ti nīvadda nadĕ
vichchanaviḍāya nim̐ka vĕrabuledu
machchigalu mena navĕ maram̐guna dām̐sarādu
yĕchchuguṁdu ledu yim̐ka nem̐ṭi bāsalayyā
(||sĕppi||)
vĕllavirāyam̐ jem̐talu vīḍĕ michchī nābĕ nīgu
tŏlli nī korinaṭṭāya dŏragĕ melu
kallalĕllā nijamāya kaddulolanam̐garādu
yĕllavāru gannabani kem̐ṭi bāsalayyā
(||sĕppi||)
paṭṭina paṁtāmu sĕllĕ pāramu lŏttī nābĕ
suṭṭariga mīḍerĕ sodiṁchanela
yiṭṭĕ śhrīveṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
yĕṭṭayina melĕ yim̐ka nem̐ṭi bāsalayyā